ప్రియురాలు నివేదాను ప్రేమగా చూస్తూ..!

216
Adiga Adiga Song Teaser
Adiga Adiga Song Teaser
- Advertisement -

‘నేనులోకల్‌’ తర్వాత నాని హీరోగా నటిస్తున్న చిత్రం ‘నిన్ను కోరి’. ఈ రోజు ఓ సీక్రెట్ రివీల్ చేయ‌నున్నాడు అనే వార్త నిన్న సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టింది. నాని దేని గురించి చెబుతాడా అని ఫ్యాన్స్ అంద‌రు ఎంతో ఆశ‌గా ఎదురు చూశారు. తాజాగా త‌న సోష‌ల్ మీడియాలో ఓ వీడియో ద్వారా ఆ విష‌యాన్ని రివీల్ చేశాడు. నిన్ను కోరి చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌ని చెప్పిన నాని, ఈ నెల 27న సినిమాకి సంబంధించి ఓ ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు తెలిపాడు. శ్రీరామ్ పాడిన అడిగా అడిగా అనే పాట త‌న‌కెంతో నచ్చింద‌ని, ఇది త‌న కెరియ‌ర్ లో ఆల్ టైం ఫేవ‌రేట్ అని నాని అన్నాడు. ఈ సాంగ్ ల‌వ్ లో ప‌డ్డ వాళ్ళ‌కి , ల‌వ్ లో ప‌డ‌బోయే వాళ్ళ‌కి, ల‌వ్ లో ప‌డి బ‌య‌ట‌ప‌డిన వాళ్ళ అంద‌రిని ఈ సాంగ్ త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని నాని పేర్కొన్నాడు.

ఇక ఈ చిత్రంలోని ‘అడిగా అడిగా..’ అనే పాట టీజర్‌ను బుధవారం సాయంత్రం నాని ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు. ఓ చిన్న మ్యూజిక్‌ బిట్‌ నేపథ్యంగా ఉండే ఈ వీడియోలో నాని, నివేదా థామస్‌ సముద్ర తీరాన కూర్చొని కనిపించారు. నాని తన ప్రియురాలు నివేదాను చాలా ప్రేమగా చూస్తూ కనిపించారు. ‘జీవితానికి స్వాగతం పలకండి’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను టీజర్‌ చివర్లో చూపించారు. డెబ్యూ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో నిన్ను కోరి అనే చిత్రం తెర‌కెక్క‌గా, ఈ చిత్రం లో నివేదా థామస్ కథానాయికగా నటిస్తుంది. ఆది పినిశెట్టి క్రూషియల్ రోల్ లో కనిపించనున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రం జూన్ 23న విడుద‌ల కానుంది.

- Advertisement -