TDP :నో టికెట్.. షాక్ లో సీనియర్స్!

24
- Advertisement -

సీట్ల ప్రకటన పై గత కొన్నాళ్లుగా తర్జన భర్జన పడుతున్న టీడీపీ జనసేన కూటమి ఎట్టకేలకు తొలి జాబితాను విడుదల చేసింది. ఫస్ట్ లిస్ట్ లో భాగంగా టీడీపీ 94. జనసేన 24 స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు ఇరు పార్టీల అధినేతలు ప్రకటించారు. పొత్తులో భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా కష్టపడినట్లు టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సర్వేలు నిర్వహించి, అందరి అభిప్రాయాలకు అనుగుణంగానే సీట్ల కేటాయింపు జరిగినట్లు చెప్పుకొచ్చారు. అయితే పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేవలం 24 సీట్లను మాత్రమే కేటాయించడంపై ఆ పార్టీ నేతల్లో కొంత అసహనానికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. అయితే బీజేపీని దృష్టిలో ఉంచుకొని సీట్లు తగ్గించుకున్నట్లు పవన్ చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరు కూడా స్వప్రయోజనాలను పక్కన పెట్టి కూటమి అధికారంలోకి రావడానికి కష్టపడి పని చేయాలని పవన్ సూచించారు. .

అయితే టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ పొత్తును కన్ఫమ్ చేయకుండానే సీట్ల ప్రకటన చేయడంతో బీజేపీతో పొత్తు లేనట్లే అనే వాదన వినిపిస్తోంది. బీజేపీ కలిసొస్తే తగిన నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పడంతో త్వరలో విడుదల చేయబోయే సెకండ్ లిస్ట్ లో బీజేపీతో పొత్తును కన్ఫమ్ చేస్తూ అభ్యర్థుల అభ్యర్థుల ప్రకటన జరిగే అవకాశం ఉంది. ఇకపోతే టీడీపీ చాలామంది సీనియర్స్ ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. బుచ్చయ్య చౌదరి, కళా వెంకట్రావు, బుద్దా వెంకన్న, పితల సుజాత, గంటా శ్రీనివాస్ రావు, సోమిరెడ్డి, యరపతినేని శ్రీనివాస్.. వంటి వారికి ఫస్ట్ లిస్ట్ లో చోటు దక్కలేదు.

దాంతో ఈ సీనియర్ నేతలను చంద్రబాబు పక్కన పెట్టడా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సెకండ్ లిస్ట్ లో వారికి చోటు దక్కే అవకాశం ఉందనేది కొందరి అభిప్రాయం. అయితే సెకండ్ లిస్ట్ లో కూడా పొత్తులో భాగంగా ఈ సీనియర్స్ కు నిరాశే మిగలడం ఖాయమనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఒకవేళ ఈ సీనియర్ నేతలను పక్కన పెడితే వీరు అధిష్టానంపై వ్యతిరేక గళం విప్పుతారా ? అనేది చర్చకు దారితీస్తోంది మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read;Janasena:’సిద్దం’మైన టీడీపీ జనసేన?

- Advertisement -