- Advertisement -
జార్ఖండ్ అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గింది చంపై సోరెన్ ప్రభుత్వం. కాంగ్రెస్, సీపీఎంతో కలిసి జేఎంఎం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. విశ్వాస పరీక్షకు అనుకూలంగా 47 ఓట్లు వ్యతిరేకంగా 29 ఓట్లు రావడంతో చంపై సోరెన్ సర్కార్ నెగ్గినట్లు ఆ రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రకటించారు.
81 అసెంబ్లీ స్థానాలు ఉన్న జార్ఖండ్లో జేఎంఎంకు 29 మంది ఎమ్మెల్యే ఉన్నారు. కాంగ్రెస్కు 17, సీపీఎంకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. విపక్ష బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీ మిత్రపక్షాలకు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు.
విశ్వాస పరీక్ష ఓటింగ్లో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కోర్టు అనుమతితో పాల్గొన్నారు.
Also Read:Pawan: పవన్ వెనక్కి తగ్గినట్లేనా?
- Advertisement -