ప్రధానిగా ‘రాహుల్ గాంధీ’.. అసలు సమస్య అదే?

24
- Advertisement -

ఇండియా కూటమిలో అసలు సమస్య ప్రధాని అభ్యర్థి విషయంలోనేనా ? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ మద్య ఇండియా కూటమిలో నెలకొన్న పరిస్థితులు గమనిస్తే ఈ విషయం అర్థమవుతోంది. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని కాంగ్రెస్ కలలు కంటోంది. అయితే రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టడంపై కూటమిలో మెజారిటీ పార్టీలు విముఖత చూపుతున్నాయట. పైగా సీట్ల పంపకాల విషయంలో కూడా కాంగ్రెస్ తో ఇతర పార్టీలకు పొసగకపోవడంతో అసలు సమస్య మొదలైంది. ఇండియా కూటమి తరపున ప్రధాని పదవిపై కన్నేసిన నితీశ్ కుమార్ ఇప్పటికే కూటమి నుంచి బయటకు వచ్చారు. ఇక అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ వంటి వారు సైతం ప్రధాని రేస్ లో ఉన్నారు. ఇప్పుడు వారిద్దరు కూడా కూటమితో అంటిఅంటనట్టుగానే ఉంటూ వస్తున్నారు.

ఇలా కూటమిలో అవాంతరాలు తలెత్తుతున్నప్పటికి ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని మాత్రమే చూడాలని కాంగ్రెస్ భావిస్తోంది. రాహుల్ గాంధీని ప్రధాని గా చూడాలని 67 శాతం ప్రజలు కోరుకోగా, మోడీ ని 27 శాతం ప్రజలే కురుకుంటున్నట్లు సర్వేలు చెబుతున్నాయని ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్ ఇటీవల చెప్పుకొచ్చారు. అందుకే ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని తప్పా ఇంకొకరికి అవకాశం లేదనే విధంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కూటమిలో చీలిక ఏర్పడిన వెనక్కి తగ్గేది లేదని కాంగ్రెస్ భావిస్తునట్లు తెలుస్తోంది. అందుకే కూటమిలో కాంగ్రెస్ వ్యవహారంపై ఇతర పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికి హైకమాండ్ మాత్రం అసలు పట్టించుకోవడం లేదు. అయితే కూటమిలో ఇతర పార్టీల బలం లేకుండా హస్తం పార్టీ నిలవగలదా ? అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. మరి ప్రధాని అభ్యర్థి విషయంలో నెలకొన్న అవాంతరాలు కూటమిలో ఇంకెలాంటి మలుపులకు తావిస్తాయో చూడాలి.

Also Read:ఏయ్ కంగనా… పిచ్చి పిచ్చి కూతలొద్దు

- Advertisement -