సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. కట్టుకోబోతున్న ఇల్లు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఎన్నో ఊహలు మనకి ఉంటాయి. ఇంటి నిర్మాణం పూర్తి అయితేగాని మన కలల ఇంటిని మనం చూసుకోలేము. మన ఊహలల్లో ఉన్న ఇంటిని మనం ఇప్పుడే చూసుకోవాలి అని, ఏ వస్తువు ఎక్కడ ఉంటే ఎలాగుంటుంది అన్న ఆసక్తి ఎవరికి ఉండదు? ఇదంతా రోటిన్..కాస్త భిన్నంగా కదిలే ఇంటిని నిర్మిస్తే…కదిలే ఇళ్లా..అని ఆశ్చర్య పోతున్నారా. టెక్నాలజీని ఒడిసిపట్టడంలో ముందుండే చైనాలో అలాంటి అద్భుతాలు చూస్తుంటాం…మన దగ్గర అది సాధ్యమయ్యే పనేనా అని ఆలోచించే వారిని నివ్వేర పోయేలా చేశాడు.
సాంకేతికను ఉపయోగించి ఇంటి నిర్మాణం చేపట్టడంలో ముందుండే చైనా…టెక్నాలజీకి దీటుగా ఇంటిని నిర్మించి సత్తాచాటాడు తమిళ తంబి. ఆర్థిక స్తోమత కారణంగా చదువు మద్యలోనే ఆపేసినా….తాను ఎంచుకున్న నిర్మాణ రంగంలో అద్భుతాన్ని ఆవిష్కరించి భారత ఇంజనీర్లకు పరిచయం చేశాడు. వివరాల్లోకి వెళ్తె..తమిళనాడులోని మెలపుడుక్కుడికి చెందిన 65 ఏళ్ల హమీద్…ఆర్థిక ఇబ్బందులు,కుటుంబ పోషణ కోసం చదువును మద్యలోనే ఆపేశాడు.
ఉపాధి కోసం సౌది అరేబియా చేరిన హమీద్…ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీలో పనిచేశాడు. దాదాపుగా 20 సంవత్సరాలు అక్కడే పనిచేసిన హమీద్ ఇంటి నిర్మాణానికి సంబంధించిన అన్ని మెళకువలను నేర్చుకున్నాడు. కొత్త కొత్త పద్దతులో ఇంటిని ఏలా నిర్మించాలో అవగతం చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత సొంత రాష్ట్రానికి తిరిగివచ్చిన హమీద్…గ్రామంలో సొంత ఇంటిని నిర్మించుకునే పనిలో పడ్డాడు. అందరిలా కాకుండా కాస్త భిన్నంగా ఉండే ఇంటిని నిర్మించాలనుకున్నాడు.
కుటుంబసభ్యులు,స్నేహితులతో తన ఆలోచనలను పంచుకున్నాడు. అందరు హమీద్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఇంజనీర్లు సైతం అది సాధ్యం కాదు…డబ్బులు వృధా అంటూ నిరుత్సాహపర్చారు. అయితే,తన సంకల్పాన్నే నమ్ముకున్న హమీద్…ఏకంగా 25 లక్షలు పెట్టి అద్భుత సౌదాన్ని నిర్మించాడు.ఇందుకోసం రాఫ్ట్ ఫౌండేషన్ టెక్నాలజీని ఉపయోగించి సరికొత్తగా కదిలేఇంటిని నిర్మించి తనను వారించిన వారి నిర్ణయం తప్పని నిరూపించాడు.
ఇంటిలోని బెడ్ రూమ్‌లను ఇనుపచక్రాల మాదిరిగా కదిలేవిధంగా నిర్మించాడు. తాను కదలే ఇంటిని నిర్మించాలనుకోలేదని…కొత్తగా ఉండేలా నిర్మాణం చేపట్టానని హమీద్ తెలిపాడు. తన మాదిరిగా ఇంటి నిర్మాణం చేపట్టాలనుకునే వారికి సలహాలు ఇస్తానని చెబుతున్నాడు. అంతేగాదు పలువురు సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు హమీద్ కట్టిన ఇంటిని చూసేందుకు క్యూకడుతున్నారు.
అంతేగాదు మదురై,దేవకొట్టై,రామేశ్వరంతో పాటు పలు ప్రాంతాల నుంచి ఇంజనీర్లు హమీద్ ఇంటిని చూసేందుకు వస్తున్నారు. చదువును మద్యలోనే ఆపేసి…కదిలే ఇంటిని నిర్మించిన హమీద్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మొత్తంగా చైనా టెక్నాలజీకి ధీటుగా కదిలే ఇంటిని నిర్మించిన హమీద్ కృషిని అందరు అభినందిస్తున్నారు.