నెటిజన్లకు షాకిచ్చిన హృతిక్‌ తల్లి..! వీడియో వైరల్‌

260
Hrithik Roshan's Mother HARD WORKOUT In Gym
- Advertisement -

బాలీవుడ్‌ హీరో హృతిక్‌రోషన్‌ తల్లి పింకీ రోషన్‌ నెటిజన్లకు షాకిచ్చింది. 63 ఏళ్ళ వయసులో కూడా జిమ్‌లో వ్యాయామం చేసి నెటిజన్లకు షాక్‌నిస్తూనే..వారి ప్రశంసలు కూడా పొందుతోంది.

హృతిక్‌ రోషన్‌ తన తల్లి పింకీ రోషన్‌ తో కలిసి జిమ్‌లో వ్యాయామం చేశాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా హృతిక్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్‌ లో పోస్ట్‌ చేశాడు.

ఆ వీడియోలో పింకీ రోషన్‌ వెయిట్‌ లిఫ్ట్‌ చేస్తూ కనిపించింది. ఇంకేముందీ….నెటిజన్లు హృతిక్‌ తల్లిని తెగ పొగిడేస్తున్నారు. ఇక ఈ వీడియోని పోస్ట్‌ చేసిన హృతిక్‌ ఆ వీడియోకి ఓ క్యాప్షన్‌ని కూడా పెట్టాడు. తన తల్లిని స్ఫూర్తిగా తీసుకోవాలో? మార్గదర్శకంగా తీసుకోవాలో? పోటీగా తీసుకోవాలో? తనకు అర్థం కావడం లేదని,తన తల్లి తనను గర్వపడేలా చేసిందని, ఆమెకు థ్యాంక్స్ చెబుతున్నానని తెలిపాడు.

హృతిక్‌ ఇప్పుడే కాదు..గతంలోనూ తన సినిమాలకు సంబంధించిన విషయాలనే కాకుండా..తన కుటుంబ సభ్యులకు సంబంధించిన వీడియోలను కూడా పోస్ట్‌ చేస్తుంటాడు.

ఇదిలా ఉంటే..ప్రస్తుతం హృతిక్ రోషన్ బాలీవుడ్ సినిమా ‘సూపర్‌ 30’లో నటిస్తున్నాడు.

- Advertisement -