కాంగ్రెస్, బీజేపీ రహస్య మైత్రి మరోసారి బయటపడిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. న్యాయసూత్రాలు, రాజ్యాంగ సాంప్రదాయాలు అన్ని పార్టీలకు ఒకేలా ఉండాలని కానీ గవర్నర్ తీరు అందుకు విరుద్దంగా ఉందన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను పార్టీల్లో ఉన్నారంటూ ఎమ్మెల్సీలుగా నియమించేందుకు గవర్నర్ నిరాకరించారని …ఇప్పుడు కాంగ్రెస్ ఏకంగా ఒక పార్టీ అధ్యక్షుడిని సిఫారసు చేస్తే ఆమోదించారన్నారు. . ఇది ద్వంద్వ నీతి కాదా, కాంగ్రెస్ అనుకూలంగా వ్యవహరించడం కాదా అని ప్రశ్నించారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ద్వారా కాంగ్రెస్, బీజేపీల రహస్య మైత్రి మరోసారి బయపటపడిందని….బీజేపీ అజెండా మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి మేలు చేసేలా గవర్నర్ తమిళిసై పనిచేస్తున్నారని మండిపడ్డారు. గతంలో క్రీడా, సాంస్కృతిక, విద్యా, సామాజిక, సేవా రంగాల్లో కృషి చేసిన వారిని బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసింది. అప్పుడు రాజకీయ కారణాలతో ఆమోదించలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు కలిసి బీఆర్‌ఎస్‌ను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Also Read:విటమిన్-కె లోపిస్తే ప్రమాదమా?