- Advertisement -
5 శతాబ్దాల భారతీయుల కల మరి కొద్దిగంటల్లో నెరవేరబోతోంది. బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠను వీక్షించేందుకు 50కిపైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారాలకు ఏర్పాట్లు చేశారు. రథయాత్రలు, కారు, ఆటో ర్యాలీలు, హిందూ ఆలయాల్లో దీపాల వేడుక వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు.
న్యూయార్క్‌లోని టైమ్స్ స్కేర్ సహా అమెరికాలోని 300 ప్రముఖ ప్రదేశాల్లో ఏర్పాట్లు జరిగాయి. వివిధ నగరాల్లో ఆటో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మారిషస్ జనాభాలో 48 శాతం హిందువులే. నేడు ఆ దేశంలోని ప్రభుత్వం, హిందూ ప్రభుత్వ అధికారులకు రెండు గంటల స్పెషల్ బ్రేక్ (విరామం)ప్రకటించింది.
ఇక ఫ్రాన్స్‌లో భారతీయులు గ్రాండ్ రథయాత్ర ను చేపట్టారు. పారిస్‌లోని డీ లాచాపెల్ వద్ద గణేశ్ ఆలయం నుంచి యాత్ర ప్రారంభమై, నగరంలోని ప్రముఖ ప్రదేశాల గుండా కొనసాగనున్నది.
Also Read:కొత్తిమీరతో ప్రయోజనాలు..!
- Advertisement -