Ram Mandir:రామమందిరంలో బంగారు తలుపు

20
- Advertisement -

అయోధ్య రామమందిరానికి ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. ఈ నెల 22న రామమందిరాన్ని ప్రారంభించనుండగా మొదటి అంతస్తులో బంగారు తలుపును ఏర్పాటు చేశారు. గర్భగుడి పై అంతస్తులో 12 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పులో ఈ తలుపును ఏర్పాటు చేశారు. అలాగే మరో మూడు రోజుల్లో 13 బంగారు తలుపులు ఆలయంలో ఏర్పాటు చేయనున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.

రామాలయంలో మొత్తం 46 తలుపులు ఏర్పాటు చేయగా, వాటిలో 42 తలుపులకు బంగారు పూత పూయనున్నట్లు వెల్లడించారు. ఇక రామ మందిర ప్రారంభోత్సవం రోజున అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఆలయం ప్రారంభోత్సవం రోజున యూపీ రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఉండవని స్పష్టం చేశారు యోగీ.

జనవరి 14న అయోధ్యలో పరిశుభ్రత ప్రచారాన్ని ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. 22 న అయోధ్య ఆలయంలో ప్రాణ్ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం కోసం అలంకరించనున్నారు. రామమందిర ప్రారంభోత్సవానికి దేశంలోని వివిధ పార్టీల రాజకీయ నాయకులు, బాలీవుడ్ ప్రముఖులు, క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలతో సహా 7,000 మందికి పైగా ఆహ్వానాలు పంపారు.

Also Read:‘జిల్లాల పునర్విభజన’.. రేవంత్ ఫోకస్?

- Advertisement -