IND vs SA:సఫారీ గడ్డపై చిరస్మరణీయం!

28
- Advertisement -

భారత్ మరియు సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ సమంగా నిలిచింది. మొదటి టెస్ట్ లో సఫారీ జట్టు విజయం సాధించగా రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో 1-1 గా సిరీస్ సమం అయింది. ఈ మ్యాచ్ తో టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతి తక్కువ ఓవర్లలో ( 107 ) కేవలం ఒకటిన్నర రోజుల్లోనే ఫలితం తేలిన మ్యాచ్ గా సౌతాఫ్రికా మరియు టీమిండియా మద్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ నిలిచింది. తొలి ఇన్నింగ్స్ లో 55 పరుగులకే కుప్పకూలిన సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్ లో భారత్ బౌలర్స్ ధాటికి కుదేలైంది.

మహ్మద్ సిరాజ్ ( 6/15 ) బుమ్రా (6/60) ఉత్తమ గణాంకాలతో సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్స్ కుదేలయ్యారు.. మార్క్రమ్ ఒంటరి పోరు చేస్తూ (106) సెంచరీతో మరపురాని ఇన్నింగ్స్ ఆడి 176 పరుగ్ల వద్ద నిలిచేలా చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్ లో 55 పరుగులు చేసిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో లక్ష్యం చిన్నది కావడంతో ఆడుతూ పడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో రెండో టెస్ట్ లో భారత్ 7 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. గత కొంత కాలంగా సఫారీ గడ్డపై తడపడుతూ వస్తున్న టీమిండియా ఈ టెస్ట్ సిరీస్ సమం చేసి కొత్త ఉత్సాహాన్ని కూడగట్టుకుంది.

ఓవరాల్ గా సౌతాఫ్రికా టూర్ లో టీ20 సిరీస్, టెస్ట్ సిరీస్ సమం కాగా, వన్డే సిరీస్ ను మాత్రం భారత్ సొంతం చేసుకుంది. ఇక త్వరలోనే అఫ్గానిస్తాన్ టూర్ కు బయలు దేరానుంది టీమిండియా. అఫ్గాన్ జట్టుతో మూడు టీ20 మ్యాచ్ లు అడనుంది. ఈ ఏడాది జూన్ లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో అఫ్గాన్ తో జరగనున్న టీ20 సిరీస్ టీమిండియా కు కీలకం కానుంది. మరి ఈ ఏడాది ఆరంభం లోనే సౌతాఫ్రికా టూర్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా అఫ్గాన్ టూర్ లో ఎలా రాణిస్తుందో చూడాలి.

Also Read:మల్కాజ్‌గిరి బరిలో మల్లారెడ్డి!

- Advertisement -