Amith Shah:వారిద్దరికి అమిత్ షా వార్నింగ్?

33
- Advertisement -

బీజేపీ అగ్రనేత అమిత్ షా తాజాగా తెలంగాణలో పర్యటించిన సంగతి తెలిసిందే. మరో మూడు నెలల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ నేతలను సమాయత్త పరిచేందుకు రాష్ట్ర నేతలతో ఆయన సమావేశమై పలు విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వైఫల్యం, నేతల పనితీరు వంటి తదితర అంశాలపై ఆయన ఆరా తీసినట్లు వినికిడి. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నేతలైన బండి సంజయ్, ఈటెల రాజేందర్ పై ఓ అమిత్ షా ఓ రేంజ్ లో ఫైర్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. వారిద్దరి మధ్య గత కొన్నాళ్లుగా కోల్డ్ వార్ నడుస్తోందనే వార్తలు అడపా దడపా వస్తూనే ఉన్నాయి. .

ఎన్నికల ముందు ప్రచారం నత్త నడకన సాగడానికి కారణం కూడా వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలే కారణమనే వాదన కూడా గత కొన్నాళ్లుగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీని ముందుండి నడిపించవలసిన నేతలే ఎడమొఖం పెడమొఖంగా ఉండే పార్టీ పరిస్థితి ఎలా కుదుటపడుతుందని బండి సంజయ్, ఈటెలకు షా చురకలంటించారట. రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా విభేదాలు పక్కన పెట్టి పార్టీ కోసం పని చేయాలని అమిత్ షా సూచించినట్లు టాక్. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు రాకపోవడంతో ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటలని అమిత్ షా గట్టిగా సూచించారట.

మరి బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఇకనుంచైనా విభేదాలను పక్కన పెట్టి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తారేమో చూడాలి. ఇటీవల ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. తాను పార్టీ మారకపోయినప్పటికి.. బీజేపీలోని కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, తనను పార్టీ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఇటీవల వ్యాఖ్యానించారు., ఆ వ్యాఖ్యలు పరోక్షంగా బండి సంజయ్ గురించే అన్నారా ? అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరి అమిత్ షా చొరవతో బండి ఈటెల మద్య సక్యత ఏర్పడుతుందేమో చూడాలి.

Also Read:రవాణా శాఖలో JTCల ట్రాన్స్‌ఫర్

- Advertisement -