ప్చ్.. మళ్లీ పెంచేసిన తమన్నా

23
- Advertisement -

‘తమన్నా’ చాలా బోల్డ్.. ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే స్వభావం తమన్నాకి మేకప్ తోనే అబ్బింది. పైగా మొహమాటం అనేది తన బ్లడ్ లోనే లేదనేది ఎపుడూ తమన్నా చెప్పే మాట. ప్రస్తుతం ఆమెకు ఛాన్స్ లు తగ్గాయి. ఐతే, మెగాస్టార్ చిరంజీవి – వశిష్ఠ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు తమన్నా మళ్లీ భారీగా రెమ్యూనరేషన్ పెంచేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఓ కొత్త సినిమా కోసం రూ.1 కోట్ల 60 లక్షల వరకు డిమాండ్ చేస్తోందట. మెగాస్టార్ సినిమాకు రూ. కోటి తీసుకుంటున్న ఈ భామ ఇప్పుడు రూ.60 లక్షలు పెంచేసినట్లు సమాచారం.

సీనియర్ హీరోలతో నటించేందుకు ఇతర హీరోయిన్లు ఆలోచిస్తున్నారని, అందుకే తమన్నా అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు ఓకే చెబుతున్నారని తెలుస్తోంది. మొత్తానికి ‘తమన్నా’కి ఫామ్ లేకపోయినా.. కాలం కలిసి వస్తూనే ఉంది. ఇక తమన్నా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను కమర్షియల్ గా మారడానికి గల కారణాలను చెప్పుకొచ్చింది. ‘నాకు డబ్బు అంటే ఇష్టం. నేను కాలేజీలో ఉన్నప్పుడు నాకు ఓ కారు కొనాలనే కోరిక ఉండేది. కానీ ఆ సమయంలో డబ్బు లేకపోవడం కారణంగా ఆ కోరిక తీరలేదు. అప్పుడే నిర్ణయించుకున్నాను. బాగా డబ్బు సంపాదించాలి అని.

నిజానికి మా పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బు తీసుకోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు. అందుకే రెండు, మూడు సినిమాలు చేసి ఆ డబ్బుతో నాకు నచ్చిన కారు కొనాలని ప్లాన్ చేసుకున్నాను అని తమన్నా చెప్పుకొచ్చింది. ఐతే, ఓ దశలో ఇక సినిమాలకు కూడా గుడ్‌ బై చెబుదామని అనుకున్నాను అని, అయితే, పరిస్థితులు మారాయి అని, అలాగే తన ఆలోచనలు కూడా.. తనకు తెలియకుండానే తాను సినిమాలను ఇష్టపడేలా చేశాయి అని తమన్నా చెప్పుకొచ్చింది.

Also Read:సీఎం రేవంత్‌తో నాగార్జున భేటీ

- Advertisement -