ఆరు గ్యారెంటీలేనా..వాటి సంగతేంటి?

47
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కూడా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో ఇచ్చిన హామీలనే హైలెట్ చేస్తూవచ్చింది. వాటినే ప్రజల్లోకి తీసుకెళ్లి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కేవలం ఆరు గ్యారెంటీ హామీలనే అమలు చేస్తారా ? మిగిలిన హామీల సంగతేంటి అనే ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎన్నికల ముందు ఎన్నో అలివిగాని హామీలను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కేవలం ఆరు గ్యారెంటీ హామీలనే ప్రస్తావిస్తోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తొలిరోజునే ఆరు గ్యారెంటీ హామీలపై సంతకం రేవంత్ రేవంత్ రెడ్డి అందులో రెండు హామీలను ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చారు. మిగిలిన హామీలను మరో 100 రోజుల్లో పూర్తి చేస్తామని క్లారిటీ ఇచ్చారు..

అయితే ఏ ఏ హామీ ఎలా అమలు చేయబోతున్నారనే దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ప్రజలను మబ్య పెట్టేందుకే తప్పా హామీల అమలు దిశగా కాంగ్రెస్ ఆలోచంచడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజావాణి ప్రతిరోజూ నిర్వహిస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఆ కార్యక్రమాన్ని రెండు రోజులకే పరిమితం చేశారనే వాదన కూడా వినిపిస్తోంది.

ఇదిలా ఉంచితే ఆరు గ్యారెంటీలు మాత్రమే కాకుండా కాంగ్రెస్ ప్రకటించిన మరికొన్ని హామీలను తాజాగా మాజీ మంత్రి కే‌టి‌ఆర్ అసెంబ్లీలో గుర్తు చేశారు. మొదటి క్యాబినెట్ లోనే మెగా .డిఎస్సీ విడుదల చేస్స్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. 24 గంటల్లోనే ఋణామాఫీ చేస్తామని రాహుల్ గాంధీ అన్నారని, ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా రైతుబంధును డిసెంబర్ 9 న విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, ఇప్పటికే దానిపై ఎలాంటి ప్రకటన చేయలేదని, ఇంకా బీసీలకు లక్ష కోట్ల సబ్ ప్లాన్ హామీ, వెనుకబడిన తరగతుల వారికి ప్రత్యేక మినిస్ట్రీ, మైనారిటీలకు సబ్ ప్లాన్.. ఇలా ఎన్నికల ముందు చాలానే హామీలను కాంగ్రెస్ ప్రకటించిందని.. వాటి సంగతేంటి అని అసెంబ్లీలో కే‌టి‌ఆర్ ప్రశ్నించారు. మరి ఆరు గ్యారెంటీలపైనే ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ సర్కార్ మిగిలిన హామీలపై ఎలా ముందడుగు వేస్తుందో చూడాలి.

Also Read:‘గవర్నర్’ పదవీకే సిగ్గు ?

- Advertisement -