KTR:గవర్నర్ ప్రసంగం తప్పుల తడక

42
- Advertisement -

గవర్నర్ ప్రసంగం అంతా తప్పుల తడక అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. కాంగ్రెస్ ప‌రిపాల‌న‌లో రాష్ట్ర భ‌విష్య‌త్ ఐదేండ్లు ఎట్ల ఉండ‌బోతుందో మాకు, రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైందన్నారు. వాస్త‌వాలు ప్ర‌జ‌ల ముందు పెట్టాల్సిన బాధ్య‌త మాపై ఉందన్నారు.

గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం పూర్తిగా అస‌త్యాలు, అభూత క‌ల్ప‌న‌లు, త‌ప్పుల త‌డ‌క‌గా సాగిందన్నారు. ఇలాంటి ప్ర‌సంగాన్ని విన‌డానికి ఒక స‌భ్యుడిగా సిగ్గుప‌డుతున్నా అన్నారు. ఇంత దారుణ‌మైన ప్ర‌సంగం రాష్ట్ర శాస‌న‌స‌భ చ‌రిత్ర‌లో విని ఉండం అన్నారు.

వెయ్యి ఎలుక‌లు పిల్లి తీర్థ‌యాత్ర‌ల‌కు బ‌య‌ల్దేరిన‌ట్లు, చేయాల్సిన ఘాతుకాల‌న్నీ చేసి చాలా అద్భుత‌మైన ఉప‌న్యాసం చేసి, గ‌త ప్ర‌భుత్వంపై నెపాన్ని నెట్టే ప్ర‌య‌త్నం చేసింది ఈ కాంగ్రెస్ ప్ర‌భుత్వం..దీనిని తప్పుబడుతున్నా అన్నారు.

Also Read:బబుల్‌గమ్‌..బ్లాక్ బస్టర్ అవుతుంది

- Advertisement -