ఆర్టికల్ 370.. సమంజసమే!

42
- Advertisement -

జమ్మూ మరియు కాశ్మీర్ లకు సంబంధించి స్వయం ప్రతిపత్తిని సూచించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల ముందు ఆర్టికల్ 370 ని రద్దు చేస్తామని చెప్పిన బీజేపీ హామీ ఇచ్చింది. చెప్పినట్లుగానే 2019 ఆగష్టు 5న ఆర్టికల్ 370, 35ఏ లను రద్దు చేసింది. ఆ తరువాత 2019 నవంబర్ 3న జమ్మూ కాశ్మీర్ అమృయు లదాఖ్ లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది. అయితే ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ జమ్ము కాశ్మీర్ కు చెందిన పలు పార్టీలు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాయి. ఈ పిటిషన్ల పై ఈ ఏడాది ఆగష్టు లో సుప్రీం కోర్టు విచారణ జరపగా తుది తీర్పును హోల్డ్ లో ఉంచింది. ఇక తాజాగా ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు తుది తీర్పును వెల్లడించింది. ఆర్టికల్ 370 రద్దుపై కేంద్రం తీసుకున్న నిర్ణయం కరెక్టేనని తేల్చి పెచ్చింది ధర్మాసనం..

అంతేకాకుండా 2024 సెప్టెంబర్ 30 లోపు అక్కడ ఎన్నికలు కూడా నిర్వహించాలని తెలిపింది. అయితే సుప్రీం కోర్టు తీర్పును తప్పుబడుతూ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్ధుల్లా వంటివారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆర్టికల్ 370 రద్దు కు సంబంధించి కేంద్రం చెప్పిన కారణాలను పరిశీలిస్తే… క్రయవిక్రయాలకు ఇతర ప్రాంతాల వారికి అనుమతి లేకపోవడంవల్ల కార్పొరేట్ కంపెనీలు పెట్టుపడి పెట్టేందుకు ముందుకు రావడం లేదని, దీంతో అభివృద్ది అక్కడ మందగించిందనేది కేంద్ర ప్రభుత్వం వినిపించే వాదన.

అంతే కాకుండా జమ్ము కాశ్మీర్ కు ప్రత్యేక జెండా ఉండడం రాజ్యంగ స్పూర్తికి విరుద్దామని, అలా ఉండడం వల్ల ఉగ్రవాదులకు అడ్డాగా మారే అవకాశం ఉందని అందుకే ఆ ప్రత్యేక ప్రతిపత్తిని సూచించే ఆర్టికల్ 370 రద్దు చేయాల్సి వచ్చిందని కేంద్రం చెబుతోంది. ఎట్టకేలకు కేంద్ర నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా మద్దతు తెలపడంతో ఇకపై అన్నీ రాష్ట్రాల మాదిరిగానే జమ్ము కాశ్మీర్ లో కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

Also Read:న్యూడ్ సీన్లపై హీరోయిన్ స్పందన

- Advertisement -