నెట్‌ ఫ్లిక్స్ సీఈవో ఎందుకు కలిశారో?

66
- Advertisement -

నెట్‌ఫ్లిక్స్ CEO టెడ్ సరండోస్ ప్రస్తుతం టాలీవుడ్ పై పడ్డారు. వరుసగా స్టార్ హీరోలతో పాటు వారి ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా కలుస్తున్నారు. తాజాగా టెడ్ సరండోస్ సూపర్ స్టార్ మహేష్ బాబుని కలిశారు. ‘గుంటూరు కారం’ సెట్లో మహేష్ బాబు, త్రివిక్రమ్‌ని కలిశారు. ఈ విషయాన్ని మహేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వారితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. నెట్ ఫ్లిక్స్ CEOతో పాటు అతని టీంతో ఫ్యూచర్ ఎంటర్టైన్మెంట్‌కి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు కాఫీ తాగుతూ మాట్లాడుకున్నాం అని పోస్ట్ చేశారు. మరి నెట్‌ఫ్లిక్స్ ఏమైనా భారీ మల్టీస్టారర్ ను ఏమైనా ప్లాన్ చేస్తోందా ?.

ఎందుకంటే.. నెట్‌ఫ్లిక్స్ CEO టెడ్ సరండోస్ నందమూరి ఫ్యామిలీని కూడా కలిశారు.నిన్న మధ్యాహ్నం సరండోస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, డైరెక్టర్ కొరటాల శివలతో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. టెండ్‌ సరండోస్‌కి లంచ్ ఏర్పాటు చేసి, వారితో టైం గడిపినందుకు సంతోషంగా ఉందని పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. అన్నట్టు అంతకు ముందు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇంట్లో ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరాండోస్ సందడి చేసిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్‌ కు వచ్చిన వెంటనే సరాండోస్ చిరంజీవి, చెర్రీతో భేటీ అయ్యారు. భారత్ లో తమ తదుపరి ప్రణాళికల గురించి, వ్యాపార విస్తరణ, సినిమాలు తదితర అంశాలపై చర్చించాము అని నెట్‌ఫ్లిక్స్ CEO టెడ్ సరండోస్ అని తెలిపారు. ఇక ఈ భేటీలో కూడా రామ్ చరణ్, చిరంజీవి మాత్రమే కాదు, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ సోదరులు కూడా పాల్గొన్నారు. మరి నెట్‌ ఫ్లిక్స్ సీఈవో అసలు ఏ ప్లాన్ తో తెలుగు స్టార్ హీరోలను ఎందుకు కలుస్తున్నారు అనేది చూడాలి.

Also Read:వాకర్ సాయంతో కేసీఆర్ నడక

- Advertisement -