వాకర్ సాయంతో కేసీఆర్ నడక

40
- Advertisement -

ఎర్రవల్లిలోని తననివాసంలో గురువారం రాత్రి బాత్ రూంలో కాలుజారిపడటంతో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు ఎడమకాలితుంటి ఎముక ప్రాక్చర్ అయిన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే కేసీఆర్‌ని యశోద ఆస్పత్రిలో చేర్చగా ఎడమకాలి తుంటి విరగడంతో శస్త్రచికిత్స ద్వారా రీప్లేస్ చేశారు.

ఇక ఆపరేషన్ తర్వాత కేసీఆర్‌ని వాకర్ సాయంతో నడిపించారు. ఫోటోలో కేసీఆర్ అతి కష్టం మీద నడుస్తున్న దృశ్యం కనిపిస్తోంది.కేసీఆర్ కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని చెప్పారు డాకర్లు. ఇక కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని దగ్గరుండి మరి చూసుకుంటున్నారు కేటీఆర్.

ఇక ఇవాళ్టి నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా ఎమ్మెల్యేలంతా కేసీఆర్‌ను బీఆర్ఎస్‌ఎల్పీ లీడర్‌గా ఎన్నుకున్నారు. కేసీఆర్ కోలుకున్నాక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనుండగా కేటీఆర్ సైతం ఆస్పత్రి దగ్గరే ఉండటంతో ప్రమాణస్వీకారం చేయలేదు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు డాక్టర్లు

కేసీఆర్ కి శస్త్ర చికిత్స జరిగిన నేపథ్యంలో యశోద హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.కేటీఆర్ తో కలిసి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.కుటుంబసభ్యులను పరామర్శించారు.వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని వేగంగా కోలుకోవాలని ప్రార్థించారు.

Also Read:రాజీనామా చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు..

- Advertisement -