సి‌ఎం అంటే ‘గుంపుమేస్త్రి’.. ఇదేనా రేవంత్ నాలెడ్జ్‌!

53
- Advertisement -

రాష్ట్ర ప్రజల భవిష్యత్తు రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది. అలాంటి ముఖ్యమంత్రికి అన్నీ శాఖలపై పూర్తి స్పష్టత, అవగాహన ఉండడం చాలా అవసరం. అలాగే అన్నీ రామ్గాలలోను అభివృద్ధి సాధించే నైపుణ్యం, ప్రజల సమస్యలను పరిష్కరించే తత్వం.. రాష్ట్ర బాద్యతను భుజాన వేసుకొని ముందుకు నడిపించే గుణం.. ఇలా చెప్పుకుంటూ పోతే ముఖ్యమంత్రి పదవికి ఉండే అర్హతలు చాలానే ఉన్నాయి. వాటన్నిటిలో కూడా బి‌ఆర్‌ఎస్ అధినేత కే‌సి‌ఆర్ తన సమర్థవంతమైన పాలనతో సి‌ఎం పదవికి పర్యాయ పదంగా నిలిచారు. తన విజన్ తో ప్రపంచమే తెలంగాణ వైపు చూసేలా చేశారు కే‌సి‌ఆర్. మరి ఈ స్థాయిలో పరిపాలించే నాయకుడు ఇతర పార్టీలలో ఉన్నాడా అంటే ముమ్మాటికి లేడనే చెప్పాలి..

ప్రస్తుతం అధికారం కోసం తెగ ఆరాటపడుతున్న కాంగ్రెస్ కే‌సి‌ఆర్ కంటే మిన్నగా రాష్ట్రాన్ని పాలించే నాయకుడు ఉన్నారా ? అంటే కనుచూపు మేరలో కూడా కనిపించారు. అదేంటి రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా ? అనే సందేహం రావచ్చు. సి‌ఎం పదవిపై ఆయనకు ఉన్న అవగాహన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయనే వెల్లడించాడు. సి‌ఎం అంటే గుంపుమేస్త్రి అని అన్నీ శాఖలను మేనేజ్ చేస్తే సరిపోతుందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను చూస్తే ముఖ్యమంత్రి పదవిపై ఆయనకు అసలు ఆవగింజంత అవగాహన కూడా లేదని ఇట్టే అర్థమౌతుంది. ముఖ్యమంత్రి పదవి విషయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సి‌ఎంను గుంపు మేస్త్రితో పోల్చే రేవంత్ రెడ్డి సి‌ఎంగా ఏ మాత్రం పనికి రాడని అలాంటి వారిని గెలిపిస్తే రాష్ట్రాన్ని అమ్మేయడం గ్యారెంటీ అని రాజకీయ వాదులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి పదవికి ఎవరు అర్హులో ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయ్యారని కే‌సి‌ఆర్ ను మూడోసారి సి‌ఎం చేసేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని రాజకీయవాదులు చెబుతున్నారు.

Also Read:ఓటేసిన బన్నీ,ఎన్టీఆర్,కవిత

- Advertisement -