మరి సినిమాల్లో బూతు సంగతేంటి?

41
- Advertisement -

హీరోయిన్ త్రిష, నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ వ్యవహరం నిత్యం నలుగుతూనే ఉంది. త్రిషపై మన్సూర్‌ అలీఖాన్‌ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన దగ్గర నుంచి ఈ వివాదాన్ని క్యాష్ చేసుకోవాలని కొన్ని టీవీ ఛానెల్స్ తెగ ఉబలాట పడుతున్నాయి. దీనికితోడు మన్సూర్‌ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్‌ సుమోటోగా స్వీకరించింది. ఈ క్రమంలో మన్సూర్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు కూడా క్లారిటీ ఇచ్చారు.

ఇంత జరుగుతున్నా.. ఈ విషయంపై మాట్లాడిన మన్సూర్‌, త్రిషకు ఎలాంటి క్షమాపణలు చెప్పేదే లేదు అంటున్నాడు. తాను కూసిందే కోయిలమ్మ రాగం అంటే ఎట్టా మన్సూర్‌ ?, ఆల్ రెడీ కేసు కూడా నమోదు అయ్యింది. ఈ పరిస్థితుల్లో మరొకరు ఉండి ఉంటే.. త్రిష కాళ్ళు పట్టుకొని అయినా, క్షమాపణలు చెప్పేవారు. కానీ ఇక్కడ ఉంది మన్సూర్‌ అలీఖాన్‌. అందుకే, తన మాటల్లో ఎలాంటి తప్పుడు మ్యాటర్ లేదని నేటికీ వాదిస్తున్నాడు. అసలు తప్పు అంటే ఏమిటి ?, త్రిష గత బోల్డ్ సీన్స్ గురించి వ్యంగ్యంగా కామెంట్స్ కూడా చేస్తున్నాడు.

పైగా తానేంటో తమిళనాడు ప్రజలకు తెలుసునని, వారి మద్దతు తనకు ఉందని మన్సూర్‌ అలీఖాన్‌ చెప్పుకొచ్చాడు. పనిలో పనిగా త్రిషకు తాను సారీ చెప్పబోనని స్పష్టం చేశాడు. ‘సినిమాల్లో హత్య చేస్తే నిజంగానే చేసినట్లా? సినిమాల్లో రేప్‌ చేస్తే నిజంగానే చేసినట్లా?’ అని తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ.. లేనిపోని వివాదంలోకి మన్సూర్‌ అలీఖాన్‌ ఇరుక్కుంటున్నాడు. ఇంతకీ, ఈ నటుడి మాటల్లో తప్పు ఉందా ?, సరే ఉంది అనుకుంటే.. ఇక సినిమాల్లో బూతు సంగతి ఏమిటి ?, జాతీయ మహిళా కమిషన్‌ ఏం చేస్తోంది.

Also Read:చలికాలంలో కీరదోస తింటే ఎన్నో ప్రయోజనాలో..!

- Advertisement -