BJP:బండి మరోసారి.. మత విద్వేషం!

63
- Advertisement -

కులాల మధ్య కుంపట్లు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందడం బీజేపీకి కొత్తేమీ కాదు. ఆ పార్టీ విధి విధానాల్లో ఈ విధానం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. హిందుత్వ నినాదంతో ఆ పార్టీ ఉన్నప్పటికి ఇతర మతాలను కించపరిచేలా చేస్తూ మతవిద్వేషాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు కొందరు కమలనాథులు. అలాంటి వారిలో తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ముందు వరుసలో ఉంటాడనే చెప్పొచ్చు. ఆయన చేసే వ్యాఖ్యలు, ప్రసంగలలో ఏదో ఓ మూల మత చిచ్చు రేపేలా వ్యవహరించడం ఆయన నైజాం. గతంలో జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల నేపథ్యంలో ముస్లిం లను తరిమేయ్యాలని, మసీదులను కుల్చాలని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ కూడా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నాయి.

ఇక తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు మరోసారి ఈ తరహా వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ అవుతున్నారు. ఏం ఐ ఏం అధినేత అసదుద్దీన్ ఒవైసీని ఉద్దేశించి ఆయనకు బొట్టు పెట్టించి హనుమాన్ చాలీసా ‘చదివించాలని కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. ఒక ముస్లిం ను అవమాన పరిచేలా బండి సంజయ్ వ్యాఖ్యానించారని ముస్లిం సంఘాలు మండి పడుతున్నాయి. మొదటి నుంచి కూడా మైనారిటీలపై విషం కక్కుతున్న బండి సంజయ్ హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు రేపి రాజకీయ లబ్ది పొందే ప్రణాళికాలు వేస్తున్నారని రాజకీయ వాదులు అభిప్రాయ పడుతున్నారు. ఇలాంటి వ్యక్తులకు అధికారమిస్తే మత స్వాతంత్ర్యపు హక్కును కాలరాసి లౌకికవాదాన్ని సమాధి చేస్తారని విశ్లేషకులు మండి పడుతున్నారు.

Also Read:కల నెరవేరేనా.. కప్పు కొడతారా?

- Advertisement -