Congress:కాంగ్రెస్ వస్తే నిత్య జాగారమేనా?

49
- Advertisement -

కాంగ్రెస్ అంటేనే కరెంట్ కోతలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో విద్యుత్ కష్టాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏడు గంటలు.. ఐదు గంటలు.. ఇప్పుడు మూడు గంటలు.. ఇలా పూటకోసారి కరెంట్ సరఫరా ను తగ్గిస్తూ రైతులకు వ్యవసాయాన్ని భారంగా మార్చుతున్నారు. ఆర్నెల్ల క్రితం అధికారంలోకి వచ్చిన కర్నాటక పరిస్థితి మరి దారుణంగా తయారైంది. అక్కడ ప్రస్తుతం ఐదు గంటల కరెంట్ ఇస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తున్నప్పటికి మూడు గంటలు కూడా కరెంట్ రావడం లేదని రైతులు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఇక పండగ పుట దీపావళి రోజు కర్నాటక రాజధాని అయిన బెంగళూరులో కూడా కరెంట్ లేని దారుణమైన పరిస్థితి. బహుశా ఈ స్థాయిలో కరెంట్ కోతలను విధించి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం ఒక్క కాంగ్రెస్ కే చెల్లిందని ప్రజలు వాపోతున్నారు.

ఇక ప్రస్తుతం తెలంగాణలో అధికారం కోసం ప్రయత్నిస్తున్న హస్తం పార్టీకి అధికారం వస్తే.. రాష్ట్రంలో విద్యుత్ కోతలతో నిత్య జాగారమేనా అనే భయం ప్రజలను వెంటాడుతోంది. ఎందుకంటే 2013లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో భాగంగా అధికారంలో ఉన్న హస్తం పార్టీ విధించిన కరెంట్ కోతలు తెలంగాణ ప్రజలు అంతా తేలిగ్గా మర్చిపోలేరు. తీవ్రమైన కరెంట్ కోటలతో వ్యవసాయం ముందుకు సాగక, కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియక.. పొలాల దగ్గరే బిక్కు బిక్కు మంటూ రైతులు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు.

Also Read:‘దేవర’ క్లైమాక్స్ కన్నీళ్ల మయమా?

ఆ రోజులను తలుచుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ను తరిమి కొట్టాలనే భావన ప్రతి తెలంగాణ పౌరుడిలోనూ కలుగక మానదు. 2014 తరువాత కేంద్రతో కోట్లాడి రాష్ట్రాన్ని సాధించిన కే‌సి‌ఆర్ కు అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలు.. అప్పటి నుంచి కరెంట్ కోతలంటే ఎంతో ఎరగకుండా 24 గంటల ఉచిత కరెంట్ పొందుతు వ్యవసాయాన్ని సమృద్దిగా సాగిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఎన్నికల వేల తాము అధికారంలోకి వస్తే 24 గంటల కరెంట్ తీసేస్తామని కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే చెబుతుండడం వారి దుర్మార్గపు వైఖరికి నిదర్శనమని రాజకీయవాదులు చెబుతున్నారు. అందుకే హస్తం పార్టీ అధికారంలోకి వస్తే నిత్య జాగారమే నని మళ్ళీ చీకటి రోజులు రాష్ట్రాన్ని కమ్మేస్తాయని, ఓటర్లు ఆచితూచి ఓటు వేయాలని, మంచి జరిగే పాలనకే అధికారాన్ని కట్టబెట్టాలని రాజకీయ వాదులు సూచిస్తున్నారు.

- Advertisement -