పాపం షర్మిల..కాంగ్రెస్ ను నమ్మితే అంతే?

38
- Advertisement -

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పరిస్థితి పాపం రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. తెలంగాణ పాలిటిక్స్ లో స్థిరపడాలని కలల గన్నా షర్మిలకు కాంగ్రెస్ వల్ల ఆమె రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది. మొదట ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన షర్మిల. ఆ తరువాత తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే దిశగా అడుగులు వేసింది. ఈ పొరపాటు కారణంగా ఆమెను నమ్ముకుని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరిన చాలమంది నేతలు తీవ్రంగా అసంతృప్తి వెళ్లగక్కుతూ వచ్చారు. అయినప్పటికి ఆమె కాంగ్రెస్ చుట్టూనే తిరుగుతూ తన పార్టీని మరింత బలహీన పరుచుకున్నారు. తీర మొదట షర్మిల పార్టీ విలీనంపై సానుకూలంగా స్పందించిన హస్తం పార్టీ ఆ తరువాత ముఖం చాటేసింది. దాంతో చేసేదేమీ లేక మళ్ళీ తన పార్టీపై ఫోకస్ పెట్టింది షర్మిల.

కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తన పార్టీలోని చాలమంది నేతలు ఇతర పార్టీలోకి చేరారు. ఇక చేసేదేమీ లేక ఎన్నికల రేస్ నుంచి నిష్క్రమించుకోవాల్సిన పరిస్థితి. అయితే ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికి అనూహ్యంగా కాంగ్రెస్ కు మద్దతు తెలిపింది వైఎస్ షర్మిల. అయితే షర్మిల మద్దతు కాంగ్రెస్ కు ప్రకటించినప్పటికీ అటువైపు నుంచి నేతలెవరూ స్వాగతించకపోవడం గమనార్హం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భట్టి విక్రమార్క వంటి ఒకరిద్దరు తప్ప.. రేవంత్ రెడ్డి గాని ఇతరత్రా నాయకులు గాని ఎవరు స్పందించలేదు. దీంతో అసలు షర్మిలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడమే మానేసిందా అనే వాదన రాజకీయ వర్గల్లో జరుగుతోంది. పైగా షర్మిల కాంగ్రెస్ మద్దతు ప్రకటించినప్పటికీ ఆమెతో ఎలాంటి ప్రచార కార్యక్రమాలను నిర్వహించే ప్రయత్నం చేయడం లేదు హస్తంపార్టీ. దీంతో షర్మిలను నమ్మించి కాంగ్రెస్ మోసం చేసిందనే వాదన రాజకీయ వర్గాల్లో అడపాదడపా వినిపిస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ ను నమ్ముకున్న షర్మిల నట్టేట మునిగిందనే చెప్పాలి.

Also Read:‘దేవర’ క్లైమాక్స్ కన్నీళ్ల మయమా?

- Advertisement -