సినీ నటి రష్మికా మందన్నా డీప్ ఫేక్ వీడియో వ్యవహారం దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి పోస్టు చేయగా అదికాస్తా వైరల్గా మారింది. దీనిని పలువురు ప్రముఖులు ఇప్పటికే ఖండించగా తాజాగా మంత్రి కేటీఆర్ స్పందించారు.
టెక్నాలజీ దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేఇన కేటీఆర్…ఇదో అవమానకరమైన చర్యగా అభివర్ణించారు. ఓ సెలబ్రిటీని ఈ విధంగా కించపరచడం దారుణమని..ఇలాంటి ఘటనల కట్టడికి చట్టపరంగా చర్యలు తీసుకువస్తే వాటిని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలపై భారత ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
కొందరు ఆకతాయిలు రష్మికా ఫొటోను మార్ఫింగ్ చేసి ఓ అసభ్యకర వీడియోను సృష్టించారు. వీడియోలో రష్మిక బాగా ఎక్స్పోజింగ్ చేసినట్టు కనిపిస్తుంది. వీడియో చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.తాజాగా కత్రినా డీప్ ఫేక్ వీడియో కూడా రిలీజ్ కాగా అదికాస్త వైరల్గా మారింది.
Also Read:మ్యాక్స్వెల్ డబుల్ సెంచరీ..ఆసీస్ అద్భుత విజయం