పేదల సంక్షేమమే మా ధ్యేయం అన్నారు సీఎం కేసీఆర్. గద్వాల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.నాటి ఉమ్మడి పాలమూరు జిల్లా నాయకులు నీళ్ల గురించి కొట్లాడలేదు. రఘువీరారెడ్డి వస్తే అనంతపురం దాకా నీళ్లు తీసుకువెళ్లమని మంగళ హారతులు పట్టారు. వాళ్లచరిత్ర ఏందో మీకు తెలుసు. కృష్ణమోహన్ రెడ్డి ఏం చేసిండో.. ఆ చరిత్ర మీ ముందే ఉందన్నారు.
కృష్ణా, తుంగభద్ర అనే రెండు నదుల మధ్య ఉన్న నడిగడ్డను కూడా ఆగం పట్టించారు కాంగ్రెస్ నాయకులు. ఆర్డీఎస్ ఆగం పట్టించిన పార్టీ ఎవరిది..? ఆ చరిత్ర కూడా మీ ముందున్నది. ఆనాడు కరువుతో ఏడ్సినం. ఇక తప్పదు అని చెప్పి.. నేను ఉద్యమం మొదలుపెడితే పిడికెడు మందిమి ఉన్నప్పటికీ నా వెంట మీరంతా నడిచారన్నారు. గతంలో నెట్టెంపాడు కింద 20 వేల ఎకరాలు పారలేదు. ఇవాళ లక్ష 60 వేల ఎకరాలు పారుతుందన్నారు.
అన్నిరకాలుగా గద్వాల అభివృద్ధి చెందిందన్నారు. కృష్ణమోహన్ రెడ్డిని దీవించాలని కోరుతున్నాను. గద్వాలలో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ వచ్చింది. 300 పడకల ఆస్పత్రి నిర్మాణం జరుగుతోందన్నారు. సెంట్రల్ లైటింగ్ చేసుకున్నాం. కొత్త బస్టాండ్ చేసుకున్నాం. జూరాల వద్ద అద్భుతమైన గార్డెన్ చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.
Also Read:Samantha:సమంత ఇంకా దాన్ని తొలగించలేదు