Samantha:సమంత ఇంకా దాన్ని తొలగించలేదు

45
- Advertisement -

స్టార్ హీరోయిన్ సమంత తన మాజీ భర్త నాగచైతన్య పేరుతో (రొమ్ము భాగానికి దిగువన పక్కటెముకలకు పై భాగంలో) ఓ స్టైలిష్ టాటూను వేయించుకుంది. అయితే, దాన్ని తొలగించినట్లు ఆ మధ్య వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, సామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలో ఆ టాటూ స్పష్టంగా కనిపించింది. బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను షేర్ చేయగా, అందులో ‘చై’ టాటూ కనిపిస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత – నాగచైతన్య, 2021లో విడిపోయిన విషయం తెలిసిందే. మొత్తానికి చైతుతో విడిపోయాక కూడా సమంత అతని జ్ఞాపకాల నుంచి మాత్రం దూరం కాలేకపోతుంది.

ఇక సమంత ప్రస్తుతం సినిమాలకు దూరమై చికిత్స చేయించుకుంటోంది. ఆమె ప్రెజెంట్ క్రయో థెరపీ తీసుకుంటున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా వెల్లడించింది. పొగలు వస్తున్న ఓ కంటైనర్‌లో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది. ఆ ఫొటోను చూసిన నెటిజన్లు సమంతకు మళ్లీ ఏమైందని ఆందోళన చెందుతున్నారు. కాగా, పలు చర్మ సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కోసం క్రయో థెరపీని తీసుకుంటారని నిపుణులు చెబుతున్నారు. ఆ చికిత్స కారణంగా సమంత అందం కూడా రెట్టింపు అవుతుందని.. ఆమెను మరింత అందంగా చూడగలమని అంటున్నారు.

మొత్తమ్మీద సమంత ఇటు చికిత్స తీసుకుంటూనే.. అటు రీసెంట్ గా హైదరాబాద్‌లో సందడి చేసింది. ‘ది మార్వెల్స్’ యూనిట్‌తో జతకట్టిన సామ్.. మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంది. నవంబర్ 10న రిలీజ్ కానున్న ఈ మూవీ గురించి సమంత మాట్లాడుతూ.. ‘కెప్టెన్ మార్వెల్ నాకు అత్యంత ఇష్టమైన సూపర్ హీరో. మార్వెల్ ఇండియాతో జతకట్టడం థ్రిల్లింగ్‌గా ఫీల్ అవుతున్నా. ఈ సినిమా కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’ అని చెప్పింది. మళ్లీ ఆ తర్వాత సమంత మీడియా కంట కనబడలేదు.

Also Read:HCAలో అవినీతి..అజార్‌కు షాక్

- Advertisement -