నేషనల్ క్రష్ రష్మిక మందన్నా… ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. ఆమెకు సౌత్, నార్త్ లోనే కాదు, పాన్ ఇండియా వైడ్ గా మంచి గుర్తింపు ఉంది. బాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్ లతో దూసుకుపోతుంది ఈ నేషనల్ క్రష్. ‘పుష్ప’ సక్సెస్ తో, ‘గుడ్ బై’ మూవీతో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం పుష్ప-2 మీద భారీ అంచనాలను పెట్టుకుంది. కాగా రష్మిక, రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇక రీసెంట్ గా రష్మిక మందన్నా ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారుని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.
అయితే, రష్మిక మందన్నా విలువ రూ. 2 నుండి 2.3 కోట్ల ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి రష్మిక రేంజ్ రోజురోజుకు పెరుగుతుంది. ఈ క్రమంలోనే రణ్వీర్ సింగ్ తో కూడా రష్మిక ఓ సినిమా చేయబోతుంది. ఈ సినిమా కోసం ఆమె బాగా స్లిమ్ గా మారనుంది. గత కొంత కాలంగా ప్రత్యేక డైట్ కూడా తీసుకుంటుంది. దీంతో తన ఫిట్ నెస్ ట్రైనర్ సలహా మేరకు తనకు ఇష్టమైన కొన్ని ఆహారపదార్థాలకు రష్మిక దూరంగా ఉంటూ వస్తోందట. ఇన్ని రోజులుగా మానేసిన ఫుడ్ మళ్లీ తినడానికి రణవీర్ సింగ్ తో సినిమా పూర్తి కావాలట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సన్నిహితులతో చెప్పింది.
మొత్తానికి నేషనల్ రేంజ్ లో రష్మిక మందన్నా టైమ్ నడుస్తోంది. ఇక రష్మిక మందన్నా చేస్తున్న ‘యానిమల్’ సినిమా విషయానికి వస్తే.. సందీప్ వంగ.. బాలీవుడ్లో రణబీర్ కపూర్‌తో ఈ సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం హిందీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘యానిమల్’ లో రష్మికతో రణబీర్ చేసిన ముద్దు స్క్రీన్ షాట్స్ నే కనిపిస్తున్నాయి. అందుకే, ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.
Also Read:ఉదయం లేవగానే ఇవి అసలు తినకండి!