ఎప్పటికప్పుడు డిఫరెంట్ మూవీస్, రోల్స్‌తో మెప్పిస్తూ యాక్టర్‌గా తన వెర్సటాలిటీని నిరూపించుకుంటూ ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన కథానాయకుడిగా అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై ఓ భారీ బడ్జెట్ చిత్రం శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తోంది. లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి ఇందులో ఓ కీలక పాత్రను పోషిస్తుండటం విశేషం. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకలో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి విజయశాంతి క్లాప్ కొట్టగా మురళీ మోహన్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ముప్పా వెంకయ్య చౌదరి స్క్రిప్ట్ అందించారు.
భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేయటంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ముప్పా వెంకయ్య సమర్పణలో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సి.రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా బి.అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
కళ్యాణ్ రామ్ కెరీర్లో ఈ సినిమా ఓ మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోయేలా.. ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. త్వరలోనే ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటులు ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.
Also Read:బీఆర్ఎస్లో చేరిన రావుల..