స్వలింగ వివాహాలకు చట్టబద్దత కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించింది.స్వలింగ సంపర్కుల వివాహాన్ని ప్రాథమికంగా గుర్తించలేమని …అయితే వారిపై వివక్ష చూపకూడదని వెల్లడించింది ధర్మాసనం.
స్వలింగ వివాహాలపై కోర్టు చట్టాన్ని రూపొందించలేదన్నారు. పెళ్లి అనేది స్థిరమైన, మార్పులేని వ్యవస్థ అన్న భావన కరెక్టు కాదు అని, ఒకవేళ ప్రత్యేక మ్యారేజ్ చట్టాన్ని కొట్టివేస్తే, అప్పుడు దేశం స్వాతంత్య్రానికి కంటే ముందు రోజుల్లోకి వెళ్తుందన్నారు చంద్రచూడ్.కేవలం పార్లమెంట్ ద్వారానే స్పెషల్ మ్యారేజ్ యాక్టులో మార్పులు చేయాలని సూచించారు. శాసన వ్యవహారాల్లోకి కోర్టు జోక్యం చేసుకోదని…లైంగిక ప్రవృత్తి ఆధారంగా వివక్ష ప్రదర్శించడం సరికాదు అన్నారు.
స్త్రీ-పురుష జంటలకు కల్పించే సేవల్ని .. స్వలింగ సంపర్కులకు ఇవ్వకపోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది.సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది.
ALso Read:ఆస్తమా ఉందా..అయితే జాగ్రత్త!