సినిమా ఇండస్ట్రీలోని చీకటి కీచక పర్వాలలో ఎందరో నటీమణులు నలిగిపోయారు. అందుకే, హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ క్యాస్టింగ్ కౌచ్ పై ఇప్పటికే చాలామంది హీరోయిన్లు పెద్ద యుద్ధమే చేశారు. కానీ, బలమైన సినీ నేపథ్యం నుంచి వచ్చిన వారు కూడా వేధింపులకు గురి అయ్యారు అని తెలిస్తే.. ఆశ్చర్యం వేస్తోంది. పైగా కమల్ హాసన్ ఇంటి నుంచి వచ్చిన సుహాసిని మణిరత్నం కూడా ఎన్నో ఇబ్బందులు పడిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే తెలియజేసింది. హీరోయిన్ గా ఎన్నో చిత్రాల్లో నటించిన సుహాసిని.. నిజానికి ఏ రోజు గ్లామర్ షో చేయలేదు.
అయితే, హీరోయిన్ గా చేసేటప్పుడు తాను చాలా ఇబ్బందులు పడ్డానని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అసభ్యకరమైన సన్నివేశాల్లో నటించాల్సి వస్తే తాను తిరస్కరించేదాన్నని చెప్పారు. ఓ సినిమాలో హీరో ఒడిలో కూర్చునే సన్నివేశం ఉందని.. పరాయి వ్యక్తి ఒడిలో కూర్చునే సీన్ కాబట్టి తాను చేయనని చెప్పానని తెలిపారు. అలాగే, ఓ ముద్దు సన్నివేశం కూడా ఉందని.. దాన్ని కూడా చేయను అని చెప్పాను. కానీ, ఆ సినిమా మేకర్స్ మాత్రం నన్ను చేయాల్సిందిగా బలవంతం పెట్టారు. అయినా, నేను చేయను అని తేల్చి చెప్పాను. ఏది ఏమైనా నటిగా నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని సుహాసిని చెప్పడం షాక్ గురిచేసింది
అలాగే, బాలీవుడ్ నటి మృణాల్ నవేల్ కూడా తాజాగా అతను తనను రాత్రికి రమ్మన్నాడు అని సంచలన కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘నేను కెరీర్ బిగ్‌నింగ్‌లో టీవీ యాడ్స్ కోసం ఆడిషన్స్‌కు వెళ్లాను. అక్కడ క్యాస్టింగ్ ఏజెంట్ ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేశామని, అందులో మీరొకరన్నాడు. రాత్రంతా ఇద్దరం కలుసుకుని చిల్ అయితే మీరు సెలక్ట్ అన్నాడు. దీంతో నాకు పట్టరాని కోపం వచ్చి నోటికి వచ్చిన తిట్లన్ని తిట్టాను”అని ఆమె చెప్పింది. ఏది ఏమైనా నేటికీ ఇలా నటీమణులు తమ చేదు అనుభవాలు చెబుతూ ఉండటం బాధాకరమైన విషయం.
Also read:ఓటీటీ : ఈ వారం చిత్రాలివే

