జంధ్యాల గారి జాతర 2.0

75
- Advertisement -

సన్ స్టూడియో బ్యానర్ పై, శ్రీనిధి క్రియేషన్స్ సమర్పణలో నిర్మిస్తున్న తాజా చిత్రం ‘జంధ్యాల గారి జాతర 2.0’ ఈరోజు అతిరథమహారధులు మధ్య విజయవంతంగా పూజా కార్యక్రమం జరుపుకుంది. థర్టీ ఇయర్స్ పృద్వి హీరో హీరోయిన్ ల నడుమ మొదటి సీన్ కు యాక్షన్ చెప్పారు.

ఈ సందర్భంగా కమెడియన్ పృద్వి మాట్లాడుతూ.. ఈరోజు మంచిరోజని, సినిమా టైటిల్ చూడగానే చాలా అద్భుతంగా అనిపించిందని అన్నారు. ఫుల్ లెన్త్ కామెడీ చిత్రాంగా తెలుగు పరిశ్రమలో ఒక ముద్ర వేసుకుంటుంది అని చెప్పారు. హీరో క్రిష్, హీరోయిన్ కష్వీలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తన కూతురు శ్రీలు కూడా ఈ సినిమాలో నటించడం సంతోషంగా ఉందన్నారు. డైరెక్టర్ వాల్మీకి గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. కచ్చితంగా సినిమా పెద్ద హిట్ అవుతుందని పేర్కొన్నారు.

పూర్తి హాస్యభరిత చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర దర్శకుడు వాల్మీకి తెలిపారు. ఈ సినిమాకు జంధ్యాల గారి పేరు పెట్టడంతో ప్రేక్షకులకు మంచి అంచనాలు ఏర్పడుతాయని, అయితే ఈ సినిమా కచ్చితంగా అందరి అంచనాలను ఆదుకుంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హీరో క్రిష్ సిద్దిపల్లికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జంధ్యాల గారి జాతర చిత్రం విడుదల తర్వాత కచ్చితంగా ప్రేక్షకులకు హాస్య జాతర పరిచయం అవుతుందని చిత్ర దర్శకుడు వాల్మీకి వెల్లడించారు.

Also Read:అరెరే.. ఆ హీరో పెదవులు తాకాడట

ఈ సందర్భంగా హీరో క్రిష్ సిద్దిపల్లి మాట్లాడుతూ.. సినిమా ఆధ్యాంతం హాస్య భరితంగా ఉంటుందని, ప్రేక్షకులకు విందు భోజనం లాంటి సినిమా అని పేర్కొన్నారు.నటుడు రఘుబాబు మాట్లాడుతూ ఉత్సాహమైన మేకర్స్ తో పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. చిత్రం టైటిల్ చాలా బాగుందని సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను ఆనందింప చేస్తుందని తెలిపారు. సినిమాలో తనతో పాటు టాప్ కమెడియన్స్ అందరూ నటిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అలాగే చిత్ర దర్శకనిర్మాతలకు రఘుబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో హీరో క్రిష్ సిద్దిపల్లి, హీరోయిన్ కష్వీ, కమెడియన్ పృద్వి, నటుడు రఘుబాబు, యాని మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.

Also Read:ఓటీటీలో పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు

- Advertisement -