ఓటీటీలో పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు

21
- Advertisement -

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో తాజాగా పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు వచ్చాయి. మరి వాటి సంగతి ఏమిటో చూద్దాం రండి. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మెయిన్ రోల్ లో తెరకెక్కిన సినిమా ‘కింగ్ ఆఫ్ కొత్త’. గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో అభిలాష్ జోషీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆగస్టు 24న రిలీజ్ అవ్వగా.. ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘హాట్ స్టార్ట్’లో కింగ్ ఆఫ్ కొత్త స్ట్రీమింగ్ అవుతోంది.

అలాగే కన్నడలో చిన్న సినిమాగా రిలీజై సూపర్ హిట్ గా నిలిచిన సినిమా హాస్ట‌ల్ హుదుగురు బెక‌గిద్దారే. యూత్‌ ఫుల్‌ కామెడీ తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో ఈ సినిమాను ‘బాయ్స్ హాస్ట‌ల్’ పేరుతో తెలుగులో కూడా రిలీజ్‌ చేశారు. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ 5 ఈ మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది.

అదే విధంగా కన్నడ హీరో రక్షిత్‌ శ్రీమన్నారాయణ, 777 చార్లి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తాజాగా ఆయన నటించిన ‘సప్తసాగరాలు దాటి: సైడ్‌ ఏ’ సెప్టెంబర్‌ 22న విడుదలైంది. అయితే ఈ సినిమా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. కాగా, ఈ సినిమా సీక్వెల్ కూడా త్వరలో రానున్నట్లు సమాచారం.

ఇక జీవీ ప్రకాశ్‌ సంగీత దర్శకుడుగా, హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఆయన ‘బ్యాచ్‌లర్‌’తో హీరోగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా జీవీ ప్రకాశ్ నటించిన ‘అడియే’ సినిమా ఓటీటీలోకి రానుంది. సోనీలివ్ లో ఈ రోజు సాయంత్రం నుంచే ‘అడియే’ స్ట్రీమింగ్‌ కానుంది. ఇందుకు సంబంధించిన ట్రైలర్ కుడా సోనీలివ్ విడుదల చేసింది. తమిళంతోపాటు, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఇది ప్రస్తుతం ప్రసారం అవుతోంది.

Also Read:చేపనూనె వాడితే ప్రమాదమా ?

- Advertisement -