వ్యూహాలన్నీ జైలు నుంచే.. చంద్రబాబు ప్లాన్?

34
- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ లో రిమాండ్ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన జైల్లో ఉండి 15 రోజులు దాటిన ఇంతవరకు బెయిల్ పై పూర్తి స్పష్టత లేదు. అసలు బెయిల్ ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు టీడీపీ శ్రేణులు. ఈ నేపథ్యంలో టీడీపీ భవిష్యత్ కార్యకలాపాలపై ఏమాత్రం నిర్లక్షం చేసిన పార్టీకి ముప్పు వాటిల్లుతుందని భయం చంద్రబాబును వెంటాడుతున్నాట్లు తెలుస్తోంది. అందుకే ఆయన జైల్లో ఉన్నప్పటికి వ్యూహాలన్నీ పక్కగా అమలు చేయాలని టీడీపీ శ్రేణులకు సంకేతాలు ఇస్తున్నారట. అక్రమంగా ఆయనను జైలుపాలు చేశారనే నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు ఆదేశాలు జారీ చేశారట. .

తాజా జైలు అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళితే టీడీపీకి సానుభూతి పెరుగుతుందని, జగన్ దౌర్జన్య పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నట్లు టాక్. చంద్రబాబు అధెశాల మేరకు ఇకపై టీడీపీ నిర్వహించే ప్రతి ప్రచారంలోనూ జైలు అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించే ఆలోచనలో ఉన్నారట టీడీపీ శ్రేణులు. ఇక రేపటి నుంచి నారా లోకేశ్ మళ్ళీ యువగళం పాదయాత్రను తూర్పు గోదావరి జిల్లా రాజోలు నుంచి మొదలు పెట్టె అవకాశాలు కనిపిస్తున్నాయి.

పాదయాత్రలో కూడా ప్రధానంగా అక్రమ స్కామ్ ల అంశాన్నిప్రస్తావిచాలని లోకేశ్ కూడా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కాగా మరోవైపు టీడీపీతో జనసేన పొత్తు కన్ఫమ్ అయినందున, టీడీపీ ప్రచారల్లోనూ, జనసేన ప్రచారల్లోనూ ఇరు పార్టీల నేతలు ఉండేలా చూసుకోవాలని చంద్రబాబు జైలు నుంచే దిశ నిర్దేశం చేస్తున్నారట. ఇలా మొత్తానికి చంద్రబాబు జైల్లో ఉన్నప్పటికి తన వ్యూహాల్లో అమలులో ఏమార్పు ఉండబోదనే సంకేతాలను పార్టీ శ్రేణులకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరి తన అరెస్ట్ తో సానుభూతి పొందాలని భావిస్తున్న చంద్రబాబు నాయుడుకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Also Read:ఎంఎస్ స్వామినాథన్ ఇకలేరు..

- Advertisement -