తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ వేడి రోజురోజుకూ రెట్టింపు అవుతోంది. అధికార బిఆర్‌ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల రేస్ లో ముందుండగా.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మాత్రం ఇంకా అభ్యర్థుల ఎంపికలో తర్జన భర్జన పడుతూనే ఉన్నాయి. ఈ మద్య తెగ హడావిడి చేస్తున్న హస్తం పార్టీలో ఎన్నికలు దగ్గర పడే కొద్ది లొసుగులు బయటకు వస్తున్నాయి. గత కొన్నాళ్లుగా అభ్యర్థుల ఎంపికపై జల్లెడ పడుతున్న టి కాంగ్రెస్ నేతలు, టికెట్ల విషయంలో కొత్త యాపారం స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. .
తాము అడిగిన డబ్బు ఇస్తేనే టికెట్ ఇస్తామనే రీతిలో స్క్రినింగ్ కమిటీ సభ్యలు డిమాండ్ చేస్తున్నారట. ప్రస్తుతం అభ్యర్థులను ఎన్నుకునే భాద్యతను ఆ పార్టీ అధిష్టానం స్క్రినింగ్ కమిటీ చేతిలో ఉంచింది. ఈ కమిటీలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాణిక్యం థాక్రే.. ఇంకా మరికొదరు ఉన్నారు. ముఖ్యంగా టికెట్ల కేటాయింపులో రేవంత్ రెడ్డే ఎక్కువ చొరవ చూపిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన సూచించిన వారికే టికెళ్తూ కేటాయించాలని కమిటీని డిమాండ్ చేస్తున్నాడట.
తాజాగా ఆ పార్టీ నేత కొత్త మనోహర రెడ్డి చేసిన వ్యాఖ్యలు స్క్రినింగ్ కమిటీలోని అంతర్గత ఒప్పందాలను బయటపెట్టాయి. మహేశ్వరం టికెట్ కోసం బడంగ్ పేట్ మేయర్ పారిజాత నర్శింహారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి రూ.10 కోట్లు తీసుకున్నారని ఇంకా ఐదు ఎకరాల భూమి కూడా రాయించుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ టికెట్లను రేవంత్ రెడ్డి అమ్మకాని పెట్టరా ? అనే టాక్ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. గతంలో ఆయన టీడీపీలో ఉన్నప్పుడూ ఓటుకు నోటు కేసులో ధోషిగా తేలిన సంగతి తెలిసిందే. దీంతో ఇలాంటివి రేవంత్ రెడ్డికి కొత్తేమీ కాదనేది కొందరు చెబుతున్నా మాట. ఏది ఏమైనప్పటికి టికెట్ల కేటాయింపులో రేవంత్ రెడ్డి వైఖరిపై ఆ పార్టీలోనే అసంతృప్త నినాదాలు వినిపుస్తున్నాట్లు తెలుస్తోంది.
Also Read:ఎంఎస్ స్వామినాథన్ ఇకలేరు..

