గల్ప్ కార్మికుల సంక్షేమం మరిన్ని చర్యలు తీసుకోవడంతోపాటు, చట్టాలను గట్టిగా అమలు చేస్తామని తెలంగాణ ఎన్నారై మంత్రి కేటీ రామరావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి గల్ప్ సమస్యపైన ఉన్న విజన్ ను మంత్రి ఈ రోజు డీల్లీలో అవిష్కరించారు. ఈ రోజు డీల్లీలోని జవహార్ భవన్ లో గల్ప్ దేశాలు వలస వెళ్లే వారి సంక్షేమంపైన విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఎర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు వీకె సింగ్, యంజె అక్బర్‌లతోపాటు కువైట్, సౌదీ, ఓమాన్, ఖతార్, బహ్రెరన్, యుఏఈ , మలేషియా దేశాల రాయబారులు సైతం పాల్గోన్నారు. ఈ సమావేశంలో అయా దేశాల్లోని పరిస్ధితులు, వలస కార్మికుల సమస్యల మీద రాయబారులు ఒక ప్రెజేంటేషన్ ఇచ్చారు. తెలంగాణ ఏన్నారైశాఖ మంత్రి కెటి రామారావు ఈ సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ గల్ప్ కార్మికుల సమస్యలను హైలైట్ చేస్తూ సాగింది మంత్రి ప్రెజేంటేషన్. మంత్రి ప్రెజెంటేషన్ పైనా, అయన ఇచ్చిన సహాలు, సూచనలపై కేంద్ర మంత్రులు అభినందనలు తెలిపారు.
దేశం నుంచి గల్ప్‌కు వెలుతున్న వలస కార్మికుల సమాచార బ్యాంకుని ఎర్పాటు చేయాలన్నారు. ఈ సమాచారాన్ని ఒక కేంద్రీకృత వ్యవస్థ ద్వారా వలస కార్మికుల సమచారాన్ని అన్ని రాష్ట్రాలు పంచుకునే వీలు కల్పించాలన్నారు. దీంతో దేశంలోని ఏప్రాంతం నుండి గల్ప్‌కు వెళ్లినా అన్ని రాష్ర్ట ప్రభుత్వాలకు సమాచారం ఉంటుందన్నారు. ఈ విధానం అమలు కోసం సుష్మా స్వరాజ్ మంత్రి కెటి రామారావుకు హమీ ఇచ్చారు. గల్ప్ దేశాల్లోని అన్ని రాయాబార కార్యాలయాల్లో తెలుగు అనువాదకులను పెట్టాలన్నారు. ఈ మేరకు అవసరం అయితే రాష్ర్టం ప్రభుత్వ ఈ అనువాదకులను పంపిస్తుదన్నారు. గల్ప్ దేశాల్లోని ఖైదీలపై మంత్రి పలు విలువైన సలహాలిచ్చారని కేంద్ర మంత్రులు అన్నారు. అయా దేశాల్లో స్ధిరపడిన భారత సంతతి లాయర్లను వలస కార్మికులకు న్యాయ సహయం అందించేందుకు ఒక పాలసీ తీసుకురావాలని కోరారు. వీరిలోపాటు అయా దేశాల్లోని లాయర్లను న్యాయ సహాయం కోసం ఎంపిక చేయాలన్నారు.
ఇప్పటిదాకా కొన్ని కార్యక్రమాలకే పరిమితం అయిన ఇండియన్ కల్చరల్ వేల్పేర్ పండ్ ద్వారా శిక్ష పూర్తయిన ఖైదీల విడుదల, చిన్న నేరాల్లో అరెస్టయిన వారీ బెయిల్ల కోరకు ఈ పంఢ్ ద్వారా కృషిచేస్తామని మంత్రి సుష్మా స్వరాజ్ హమీ ఇచ్చారు. వివిధ కేసుల్లో అరెస్టయి శిక్ష పడిన ఖైదీలను తమ శిక్ష కాలాన్ని భారతదేశంలో పూర్తి చేసేలా అన్ని గల్ప్ దేశాలతో ఒప్పదం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఇప్పటికే యూఎఈ తో ఇలాంటి ఒక ఒప్పదం ఉన్నదని, దాన్ని అమలు చేసేలా చూస్తూనే అన్ని దేశాలతో ఒక ఒప్పందానికి ప్రయత్నం చేస్తామని సుష్మా స్వరాజ్ తెలిపారు. గల్ప్ లో మృతి చెందిన వారీ మృతదేహాలు రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు చేపట్టిన ప్రక్రియలో వేగం పెరిగిందని కానీ సౌదీ దేశం నుంచి చాల అలస్యం అవుతున్న విషయాన్ని మంత్రి సమావేశంలో పెర్కోన్నారు. అయితే సౌదీ చట్టాల ప్రకారం ప్రమాదాలు, హత్య లాంటి కేసుల విచారణ ముగిసిన తర్వతనే సొంత దేశాలకు పంపుతారని, ఇతర కేసుల్లో అలస్యం కాకుండా చూస్తామని సౌదీ రాయబారి జావేద్ అహ్మద్ మంత్రి కెటి రామారావుకు తెలిపారు. వలస కార్మికుల నుంచి అక్కడికి చేరగానే పాస్ పొర్ట్ తీసుకుంటున్నారని, పాస్ పొర్ట్ దేశానికి హక్కు ఉంటుందని, దీన్ని స్వాదీనం చేసుకోకుండా మానవహక్కుల ఉల్లంఘన కింద చర్యలు చేపట్టాలని మంత్రి కోరారు.
తెలంగాణ ప్రభుత్వం పాస్ పొర్ట్ జారీలో, పంజాబ్ ప్రభుత్వం పోలీస్ కేసులు విషయంలో, కేరళ ప్రభుత్వం సంక్షేమం కార్యక్రమాల్లో ముందంజల్లో ఉన్నయాని వీటి అనుభవాలను ఇతర రాష్ర్టల్లోనూ అమలు చేసేలా ఈ గ్రూప్ అప్ మినిస్టర్స్ ఉపయోగపడుతుందని మంత్రి కెటియార్ తెలిపారు. మంత్రి కెటియార్ సలహా మేరకు వివిధ రాష్ర్టాల నుంచి మంచి విధానాలు తెలుసుకునేలా గ్రూప్ అఫ్ మినిస్టర్స్ ఎర్పాటు చేస్తామని మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. మంత్రుల బృదం మూడు నెలలకోసారి సమావేశం అయ్యేలా చూస్తామని తెలిపారు.
ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి అత్యధిక సంఖ్యలో విద్యార్దులకు వీదేశాలకు వెళ్తున్న నేపథ్యంలో వారి గురించి మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వివిధ దేశాల్లోని నకిలీ యూనివర్సీటీల చిట్టా వెబ్ సైట్లో పెట్టాలన్నారు. గల్ప్ కార్మికులతో పాటు విద్యార్దులను మోసగించే ఎంజెంట్లను రాష్ర్ట పోలీస్ శాఖ సహకారంతో కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సుష్మ స్వరాజ్ కోరారు.
తెలంగాణ ప్రభుత్వ చొరవ వలన కేంద్ర ప్రవేశ పెట్టనున్న ఈ- సనద్ అటెస్టేషన్ కార్యాక్రమాన్ని తెలంగాణతో ప్రారంభించనున్నట్లు మంత్రి సుష్మ తెలిపారు. ఈ కార్యక్రమం పేస్, కాంటక్ట్, పేపర్, క్యాష్ లేస్‌గా ఉండాలని మంత్రి కెటియార్ కొరారు. ఈ నెల మూడవ వారంలో ప్రారంబిస్తామని తెలిపారు. మరోపైపు గల్ప్ కార్మికుల కోసం విదేశాంగ శాఖ చేపడుతున్న అవుట్ రీచ్ ప్రొగ్రాంను ఈ నెల హైదరాబాద్ లో మంత్రి ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ర్ట ప్రభుత్వం గల్ప్ వలసపైన వారికి అవసరం అయిన శిక్షణ కార్యక్రమాలపైన ఒక నెలపాటు శిక్షణ ఇచ్చేకార్యక్రామన్ని చేపట్టాలని సూచించారు.