మహిళా సాధికారతకు సీఎం కేసీఆర్ చేపడతున్న సంక్షేమ ఫథకాలే నిదర్శనమన్నారు మంత్రి హరీష్ రావు. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన హరీష్…జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ లక్ష్యం సాకారం అవుతుండటంతో డాక్టర్ కావాలనే తెలంగాణ బిడ్డల కల నెరవేరుతుందన్నారు.
Also Read:ఆసీస్ డేంజర్ గురూ.. జాగ్రత్త !
ఓ కూలీబిడ్డ, రైతు బిడ్డ, ఆటో డ్రైవర్ కొడుకు.. ఇలా ఎంతోమంది నిరుపేద పిల్లలకు ఇవాళ వైద్య విద్య చేరువయ్యిందని పేర్కొన్నారు. వైద్య సీట్లు పొందిన వారిలో ఎక్కువగా మహిళలే ఉండటం సాధికారతకు నిదర్శనమని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అందించిన గొప్ప అవకాశం సద్వినియోగం చేసుకుని, విజయవంతంగా వైద్య విద్య పూర్తి చేసి పేద ప్రజలకు మంచి వైద్య సేవలు అందించి రుణం తీర్చుకోవాలన్నారు.
సీఎం కేసీఆర్ గారి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ లక్ష్యం సాకారం అవుతుండటంతో డాక్టర్ కావాలనే తెలంగాణ బిడ్డల కల నెరవేరుతున్నది.
ఓ కూలి బిడ్డ, ఓ రైతు బిడ్డ, ఓ ఆటో డ్రైవర్ కొడుకు.. ఇలా ఎంతో మంది నిరుపేద పిల్లలకు నేడు వైద్య విద్య చేరువ అయ్యింది.
వైద్య సీట్లు పొందిన వారిలో ఎక్కువగా… pic.twitter.com/wDEjTxF0dB
— Harish Rao Thanneeru (@BRSHarish) September 21, 2023