బీజేపీలో అమిత్ షా రేపిన మంట!

32
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అంతర్మథనంతో కొట్టుమిట్టాడుతోంది. గత కొన్నాళ్లుగా పార్టీలో వర్గపోరు ఆదిపత్య పోరు తారస్థాయిలో కొనసాగుతున్నప్పటికి.. ఇటీవల అమిత్ షా రాకతో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మరింత పెరిగినట్లే కనిపిస్తోంది. ఇటీవల సెప్టెంబర్ 17 న తెలంగాణకు వచ్చిన షా.. బీజేపీలోని ముగ్గురు నేతలతోనే సమావేశం అయ్యారు. తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అలాగే ఈటెల రాజేందర్ వంటి వారితో మాత్రమే భేటీ అయ్యారు. .

ఈ సమావేశమే తెలంగాణ బీజేపీలో చిచ్చుపెట్టింది. పార్టీలో ఆ ముగ్గురు మాత్రమే ఉన్నారా..? మిగిలిన సీనియర్ నేతలంతా పార్టీ వారు కదా ? అని తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారట కొంత మంది సీనియర్ నేతలు ఓ జాతీయ నాయకుడు రాష్ట్రనికి వచ్చినప్పుడు సీనియర్ నేతలతో కలవడం సమంజసం కానీ షా మాత్రం కొందరికే ప్రదాన్యత ఇస్తూ మిగిలిన తక్కువ చేస్తున్నారని సీనియర్ బీజేపీ నేతలు గగ్గోలు పెడుతున్నారట. ఈ నేపథ్యంలో బీజేపీ నేత వివేక్ ఇంట్లో కొంతమంది సీనియర్ నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొండ విశ్వేశ్వర రెడ్డి, విజయశాంతి, గరికపాటి రామ్మోహన్ రావు, చాడా సురేశ్, రవీంద్ర నాయక్, .. వంటి తదితరులు హాజరయ్యారట.

వీరంతా కూడా పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేయడానికి సిద్దంగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎందుకంటే పార్టీలో కొత్తగా చేరినవారికే అధిక ప్రదాన్యం ఇస్తుంటే సీనియర్ నేతలుగా పార్టీలో ఉంది ఏం లాభం అని విజయశాంతి వంటి వారు బీజేపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. దీంతో పార్టీలో సరైన ప్రదాన్యం ఇస్తేనే కొనసాగుతామని లేదంటే వేరే దారి చూసుకుంటామని అధిష్టానంతో తాడో పేడో తేల్చుకునేందుకు త్వరలోనే వీరంతా డిల్లీ వెళ్లనున్నట్లు టాక్. మొత్తానికి కమలం పార్టీలో కల్లోలం రోజురోజుకు పెరుగుతుండగా అమిత్ షా రాకతో అదికాస్త తారస్థాయికి చేరుకుంది.

Also Read:ANR Statue:ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు

- Advertisement -