నేటి రోజుల్లో కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ఎప్పుడు ఎలాంటి వైరస్ లు తెరపైకి వచ్చి వాటి వల్ల ఎలాంటి వ్యాధులు పుట్టుకొస్తాయో వైద్య శాస్త్రవేత్తలు కూడా గుర్తించలేక పోతున్నారు. నిన్న మొన్నటి వరకు ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఏ స్థాయిలో కభళింఛిందో అందరికీ తెలిసిందే. మన దేశంలో కూడా కొన్ని లక్షల ప్రాణాలను బలిగొంది ఆ మహమ్మారి. దాంతో ఏ కొత్త వ్యాధి తెరపైకి వచ్చిన ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇక తాజాగా మన దేశంలో స్క్రబ్ టైఫస్ అనే కొత్త వ్యాధి కలవర పరుస్తోంది. మొదట డిల్లీలో ఈ వ్యాధికి సంబంధించిన కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 180కి పైగా కేసులు నమోదు అయ్యాయని వార్తలు వస్తున్నాయి. .
ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఒక రకమైన పురుగు కుట్టడం వల్ల వచ్చే వ్యాధి. సాధారణంగా వర్షాకాలంలో దోమలు, పురుగులు, రకరకాల కీటకాలు వృద్ది చెందడం సాధారణం. దోమల కరణంగానే మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధులు వర్షాకాలంలో ఎక్కువగా వ్యాపిస్తుంటాయి. అదే విధంగా వర్షాకాలంలో వృద్ది చెందే ఒక రకమైన పురుగు కుట్టడం వల్ల స్క్రబ్ టైఫస్ వ్యాధి వ్యాపిస్తుందట. ఈ వ్యాధి బారిన పడిన వారిలో పురుగు కుట్టిన చోట గాయం కావడం ఆ తరువాత చర్మంపై దద్దుర్లు, తీవ్రమైన జ్వరం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Also Read:రజనీకాంత్ కి కూడా ప్యాకేజీ ఇచ్చాడా?
ఇంకా కొందరిలో ఆ లక్షణాలతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అవయవాలు పని చేయకపోవడం, బలహీన పడడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయట. ఇంకా కొందరిలో వ్యాధి తీవ్రత పెరిగే కొద్ది చర్మం పై కురుపులు రావడం, పల్స్ రేట్ లో హెచ్చుతగ్గులు, వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయట. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఏ మాత్రం కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు చెబుయితున్నారు. లేదంటే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందట. కాబట్టి స్క్రబ్ టైఫస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read:స్టార్ హీరో సోదరిని మోసం చేశాడట