ఎలాంటి అవినీతి జరగలేదు:డిజైన్ టెక్ ఎండీ వికాస్

29
- Advertisement -

సీమెన్స్ ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు డిజైన్ టెక్ సంస్థ ఎంపీ వికాస్ ఖన్వీల్కర్. చంద్రబాబుకే కాదు, మరెవరికీ తాము ఎలాంటి సొమ్ము ఇవ్వలేదని.. షెల్‌ కంపెనీల ద్వారా తరలించారనేదీ అవాస్తవమని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు.

తాము ఒప్పందం మేరకు పరికరాలను సరఫరా చేశామని.. ఆడిటర్లను పంపితే అన్ని వివరాలను బిల్లులతో సహా అందిస్తామని చెప్పారు. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేయడం బాధాకరమని చెప్పారు. కేసులో విచారణ సంస్థలు తమను సంప్రదించలేదని తెలిపారు.మోదీ ప్రధాని అయ్యాక జర్మనీ పర్యటనలో భాగంగా సీమెన్స్‌ శిక్షణ కేంద్రాన్ని సందర్శించారని.. భారత్‌లో స్కిల్ డెవలెప్‌మెంట్‌కు మంచి అవకాశాలున్నాయని తెలిపారని గుర్తుచేశారు.

ప్రాజెక్టులో దోపిడీకి అవకాశమే లేదని.. తాము ఎవరికీ ఎలాంటి మొత్తాన్ని చెల్లించలేదని డిజైన్‌టెక్‌ ఎండీ తెలిపారు. తమ సంస్థ ప్రతిష్ఠ దెబ్బతినేలా ఆరోపణలు చేస్తున్నారని.. ఇలాగే వేధింపులు కొనసాగి, కంపెనీలు మూతపడి, ఉద్యోగాలు పోతే దానికి బాధ్యత ఎవరిది అన్నారు. ఈ స్కిల్‌డెవలెప్‌మెంట్ సెంటర్లు, కోర్సుల వారీగా 2.14 లక్షల మందికి శిక్షణ ఇచ్చామని.. వీరిలో 75వేల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. కియా మోటర్‌ ఉద్యోగులకు కూడా వారి అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందించామని వివరించారు.

Also Read:TTD:శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రండి

- Advertisement -