కేంద్ర ప్రభుత్వం ఇండియా నుండి భారత్‌గా పేరు మారుస్తుందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. జీ 20 సదస్సులో పాల్గొనబోయే అతిథులకు రాష్ట్రపతి ముర్ము డిన్నర్ ఆహ్వానాన్ని పంపగా అందులో ది ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉండటం చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలో ఐక్యరాజ్యసమితి స్పందించింది. ఐరాస సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గుటెర్రస్ డిప్యూటీ అధికారప్రతినిధి ఫర్హాన్ హక్ మాట్లాడుతూ.. గతేడాది టర్కీ తన పేరును తుర్కియేగా మార్చుకున్న సందర్భాన్ని ప్రస్తావించారు. ర్కియే పేరు మార్పు విషయంలో ఆ దేశ ప్రభుత్వం నుంచి మాకు ఒక అధికారిక విజ్ఞప్తి అందింది. అదే రీతిలో మరేదైనా విజ్ఞప్తి వచ్చినా మేము పరిగణిస్తాం అని తెలిపారు.
ఇక దేశం పేరు మార్పుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తుండగా ఈ విషయంలో రాజకీయాలకు తావివ్వొద్దని, జాగ్రత్తగా మాట్లాడాలని పార్టీ నేతలకు సూచించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. భారత్ అనేది దేశానికి పూర్వం ఉన్న పేరేనని వివాదాలకు పోకుండా మాట్లాలని సూచనలు చేశారు.
Also Read:మామా మశ్చీంద్ర..రిలీజ్ డేట్ ఫిక్స్