జమిలి ఎలక్షన్స్.. అంతా చిక్కుముళ్లే!

34
- Advertisement -

దేశంలో మోడి సర్కార్ జమిలి ఎలక్షన్స్ వైపు మొగ్గు చూపుతోందని ఈ మద్య తరచూ వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా 2024లో జరగాల్సిన లోక్ సభ ఎన్నికలను ఈ ఏడాది చివర్లోనే జరిపే విధంగా మోడి సర్కార్ ప్రయత్నాలు మొదలు పెట్టిందట. ఇదే ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్న అంశం. అయితే దేశ వ్యాప్తంగా అటు అసెంబ్లీ ఎన్నికలను ఇటు లోక్ సభ ఎన్నికలను ఒకే సారి నిర్వహించడం అంతా తేలికైన విషయం కాదు. ఈ ప్రతిపాదన చుట్టూ విడదీయ్యలేని చిక్కుముళ్లు చాలా ఉన్నాయి..

ముఖ్యంగా రాజ్యాంగంలో పార్లమెంట్ పదవి కాలాన్ని సూచించే ఆర్టికల్ 83, అలాగే రాష్ట్రపతి పాలనను సూచించే 85, రాష్ట్రాల అసెంబ్లీ పదవి కాలాన్ని సూచించే ఆర్టికల్ 172, 174 వంటి చట్టాలను సవరించాల్సి ఉంటుంది. అయితే వీటి సవరణకు ఏకాభిప్రాయం లభించడం అంతా తేలికైన విషయం కాదు. ఇటీవల ఎలక్షన్స్ జరిగి అధికారం చేపట్టిన కర్నాటక వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని రద్దు చేసుకునేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకునే అవకాశమే లేదు. ఈ ఏడాది చివర్లో అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ జమిలి ఎన్నికలకు వెళితే ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలను వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకు ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు, పార్టీలు అంగీకరించడం అంతా తేలికైన విషయం కాదు.

ఒకవేళ ఈ ఐదు రాష్ట్రాలతో పాటు జమిలి ఎన్నికలకు వెళితే వచ్చే ఏడాది జరగనున్న ఆంద్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల అభిప్రాయం కూడా తప్పనిసరి. ఈ సమస్యలన్నీ దాటుకొని జమిలి ఎన్నికలు నిర్వహించిన.. ఆ తరువాత ఏదో ఒక రాష్ట్రంలో అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం రాద్దైతే.. అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారనేది అతి పెద్ద ప్రశ్న. ఇలా ఇన్ని సమస్యల నడుమ రాజ్యాంగానికి చిల్లు పెట్టె విధంగా జమిలి ఎన్నికలవైపు మోడి సర్కార్ మొగ్గు చూపడం నిజంగా స్వార్థ రాజకీయాలకు నిదర్శనం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read:ఎన్టీఆర్ మళ్లీ తిరిగి వస్తావా?

- Advertisement -