ఇప్పుడేందుకు ఈ కపటప్రేమ.. మోడీజీ !

37
- Advertisement -

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత నిత్యవసర ధరల పెంపుతో సామాన్యుడి నడ్డి విరిచి.. ఇప్పుడేమో కపటప్రేమ ప్రదర్శించేందుకు కుయుక్తులు పన్నుతోంది మోడి సర్కార్. 2014 నుంచి అడ్డు అదుపు లేకుండా నిత్యవసర ధరల విషయంలో సామాన్యుడి గుండె గుబెలయ్యేలా ధరల మోత మోగించింది. 2014 కంటే ముందు దాదాపు రూ.400 ఉన్న వంట గ్యాస్ ను మోడి అధికారంలోకి వచ్చిన తరువాత అడ్డు అదుపు లేకుండా పెంచుతూ పోయారు. ఈ తొమ్మిదేళ్లలో ఏకంగా 13 సార్లు వంట గ్యాస్ ఎరిగిందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. 2023 నాటికి ఏకంగా వెయ్యి రూపాయలు దాటి రూ.1200 లకు పరుగుగులు పెడుతోంది. .

దీంతో చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న సామాన్యులకు మోడి ప్రభుత్వం వేసిన ధరల భారం అదనపు గుదిబండలా మారింది. కేవలం వంట గ్యాస్ విషయంలోనే కాకుండా పెట్రోల్, డీజిల్ వంటి ఇందన ధరలను కూడా విపరీతంగా పెంచేసింది మోడి సర్కార్. 2014 కంటే ముందు రూ.60 నుంచి రూ.70 రూపాయలు ఉన్న పెట్రోల్, ఇప్పుడు రూ.120 లకు చేరింది. అలాగే రూ.40 నుంచి రూ.50 ఉన్న డీజిల్ ఇప్పుడు ఏకంగా వంద రూపాయలకు చేరింది.

ఇలా ప్రతిదానిపై కూడా అడ్డు అదుపు లేకుండా ధరలు పెంచిన మోడి సర్కార్.. ఎప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రజలపై కపటప్రేమను ప్రదర్శిస్తోంది. ఇటీవల వంటగ్యాస్ పై రూ.200 రూపాయల మేర ధరలను తగ్గించింది. ఇక అలాగే మరికొద్ది రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు కూడా నేలకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే అయితే ఇవన్నీ కూడా మోడి సర్కార్ చేస్తున్న ఎలక్షన్ స్టంట్ అనేది స్పష్టంగా అర్థమౌతున్న విషయం. మరి మోడి కుయుక్తులన్ని దేశ ప్రజలకు తెలియనివి కావు. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో మోడి సర్కార్ దేశ ప్రజలు చెక్ పెట్టె అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Also Read:షర్మిల చివరి ప్రయత్నం..ఫలిస్తుందా?

- Advertisement -