నెయ్యి ఆ జాగ్రత్తలు పాటించకపోతే..ముప్పే!

73
- Advertisement -

నెయ్యిని అనాతి కాలం నుంచి సూపర్ ఫుడ్ గా ఉపయోగిస్తూ వస్తున్నారు. పిండి వంటకాలు, స్వీట్లు వంటి వాటిలో నెయ్యి ని కంపల్సరీగా వాడుతుంటారు. ఇంకా దద్దోజనం, ముద్దపప్పు వంటి వాటికి నెయ్యి కాంబినేషన్ ఒక స్పెషల్ టేస్ట్ ను ఇస్తుంది. ఇంకా వేడి వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి కలుపుకొని తింటే ఆ రుచి వర్ణనాతీతం.. ఇలా చెప్పుకుంటూ పోతే నెయ్యి కాంబినేషన్ తో ఉండే ఆహార పదార్థాలకు ఆధీమనులు ఎక్కువే. అయితే కొందరు నెయ్యి పై ఉండే ఇష్టంతో అమితంగా తింటూ ఉంటారు. అలా నెయ్యిని అధికంగా తినడం చాలా ప్రమాదామని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నెయ్యిలో విటమిన్ ఏ, కే, ఇ, మరియు కే వంటివి అధికంగా ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి ఉపయోగకరమైనవే అయ్నప్పటికి నెయ్యిలో కొవ్వు ఆమ్లాలు కూడా అధికం. ఈ కొవ్వు ఆమ్లల కారణంగా పలు అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. ముఖ్యంగా నెయ్యిని అధికంగా తింటే వేగంగా బరువు పెరిగే అవకాశం ఉంది. అంతే కాకుండా ఊబకాయం, స్థూలకాయం వంటి సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. ఇంకా నెయ్యిని అధికంగా సేవిస్తే కిడ్నీ వ్యాధులు కూడా పెరిగే అవకాశం ఉందట. ఇంకా నెయ్యిలో ఉండే కొవ్వు ఆమ్లాలు రక్తపోటును పెంచుతాయి. ఇక కొందరిలో ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో నెయ్యితినే అలవాటు ఉంటుంది.

Also Read:బ్రేకింగ్..ట్రంప్‌కు బిగ్ షాక్

ఇలా తినడం ఒక పరిధి మేరకు మంచిదే అయినప్పటికి.. అధికంగా సేవిస్తే జీర్ణ క్రియపై ప్రభావం పడుతుందట. ఇంకా ఒట్టి నెయ్యిని తినడం వల్ల కఫం ఏర్పడే అవకాశం ఉందట. కాబట్టి నెయ్యి తినే విషయంలో చాలా జాగ్రతలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. మనం తినే భోజనంలోనూ నెయ్యి పరిమాణం చాలా తక్కువగా ఉండేలా చూసుకోవాలట. నెయ్యి తో చేసిన స్వీట్స్ కు చాలా వరకు దూరంగా ఉండడం మంచిదట ఎందుకంటే రక్తంలో షుగర్ లెవెల్స్ ను పెంచడంతో పాటు కొలెస్ట్రాల్ కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి నెయ్యిని వీలైనంత వరకు మితంగా తీసుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -