మహారాష్ట్రలో బిఆర్ఎస్ పార్టీ రోజురోజుకు బలం పెంచుకుంటుంది. అక్కడ తీవ్ర రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ బిఆర్ఎస్ ఎంట్రీ అక్కడి రాజకీయాలకు ఊపిరినిచ్చింది. శివసేన, ఎన్సీపీ వంటి పార్టీలు బలహీన పడడంతో బిఆర్ఎస్ ను భవిష్యత్ ఆశాజ్యోతిగా చూస్తున్నారు అక్కడి ప్రజలు.. ప్రస్తుతం అక్కడ బిఆర్ఎస్ లో భారీగా చేరికలు పెరుగుతున్నాయి. శివసేన, ఎన్సీపీ, బీజేపీ వంటి పార్టీల లోని మాజీ నేతలు, అసంతృప్త నేతలు అందరూ కూడా బిఆర్ఎస్ లో చేరేందుకు అమితమైన ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే చాలమంది నేతలు, ప్రముఖులు, రైతు సంఘాల నాయకులు ఇలా చాలమంది బిఆర్ఎస్ గూటికి చేరారు. ఇక బిఆర్ఎస్ కు పెరుగుతున్న ఆధారణ కారణంగా అక్కడి ప్రాంతీయ పార్టీలు సైతం బిఆర్ఎస్ లో విలీనం అయ్యేందుకు మొగ్గు చూపుతున్నాయి..
ఆ మద్య సర్ధార్ వల్లభాయ్ పటేల్ రాష్ట్రీయ పార్టీ బిఆర్ఎస్ లో విలీనం అయిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా రైతు హక్కుల సాధనకై అవిశ్రాంత పోరాటం చేస్తున్న ” క్రాంతికారి శేత్కారి పార్టీ ” ని బిఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్లు ఆ పార్టీ అధినేత సతీష్ పాల్వే స్పష్టం చేశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా వారి అభ్యున్నతికి పాటు పడుతున్న కేసిఆర్ తో కలిసి నడవడం ఎంతో ఆనందమని, దేశభివృద్ది కేసిఆర్ తోనే సాధ్యమని గ్రహించి ” క్రాంతికారి శేత్కారి పార్టీ ” ని బిఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్లు అయాన్ చెప్పుకొచ్చారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. చిన్న పార్టీలు, ఎంతో కొంత పేరున్న పార్టీలు అన్నీ ఇప్పుడు బిఆర్ఎస్ కు మద్దతు తెలుపుతుండడంతో రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ మహారాష్ట్రలో చక్రం తిప్పబోతుందా అనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వెళ్ళబుచ్చుతున్నారు. మరి మహారాష్ట్రలో బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశ రాజకీయాల్లో మరో శకం మొదలైనట్లే అని విశ్లేషకులు చెబుతున్నా మాట.
Also Read:మీ చూపంతా ఫోన్ పైనేనా..? జర జాగ్రత్త