డీపీలు మార్చితే దేశ భక్తి పెరుగుతుందా.. మోడీజీ?

36
- Advertisement -

ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుకోవడం బీజేపీ నేతలకు తెలిసినంతగా మరెవరికి తెలియదనడంలో అతిశయోక్తి కాదు. సమస్య ఏదైనా, పరిస్థితులు ఎలా ఉన్నా.. వాటిని అనుకూలంగా మార్చుకొని రాజకీయ లభ్ది పొందుతుంటారు బీజేపీ నేతలు. పార్టీపై ప్రతికూల ప్రభావం చూపిన ప్రతిసారి జాతీయవాదాన్ని తెరపైకి తెచ్చి అందరి దృష్టిని తమవైపు తిప్పుకునేలా చేస్తుంటారు. తాజాగా మణిపూర్ అల్లర్ల విషయంలో మోడి సర్కార్ పై పెరుగుతున్న అసంతృప్తిని పారద్రోలెందుకు దేశభక్తిని అడ్డుగా ఉండుతోంది బీజేపీ.

76 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురాష్కరించుకొని ప్రతిఒక్కరు వారి యొక్క సోషల్ మీడియా ఖాతాలకు డీపీలు మార్చుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ” స్వాతంత్రోద్యమ స్పూర్తితో మనమంతా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో సోషల్ మీడియా ఖాతాలకు డీపీలు మార్చుకొని జాతీయవాదాన్ని పెంపొందిద్దాం అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. దీంతో మోడీ చేసిన ఈ ట్వీట్ పై మిశ్రమ స్పందన లభిస్తోంది. కేవలం డీపీలు మార్చుకున్నంత మాత్రాన దేశభక్తి పెరుగుతుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు దేశ గౌరవాన్ని మంటగలిపే మణిపూర్ అల్లర్ల లాంటి పరిణామాలను అదుపు చేయలేని మోడీ.. డీపీ మార్చి దేశభక్తి చాటుకోవాలని చూస్తున్నారా ? అంటూ సెటైరికల్ కామెంట్స్ వేస్తున్నారు. దీంతో ఈసారి జాతీయవాదం ముసుగులో లభ్ది పొందాలని చూస్తున్న ప్రధాని మోడీకి ప్రజలు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు.

Also Read:బుక్కైనా జగన్..వాయిస్తున్నా టీడీపీ!

- Advertisement -