విక్రమ్ సారాభాయ్..జీవిత చరిత్ర

108
- Advertisement -

భారతదేశానికి రాకెట్ సైన్స్ నేర్పిన మార్గదర్శకుడు విక్రమ్ సారాభాయ్. భారత ప్రభుత్వానికి తన ప్రణాళికలు సమర్పించి, ఒప్పించి 1962 లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసర్చ్ (INCOSPAR) రూపొందడంలో కీలకపాత్ర పోషించారు. తర్వాత 1969లో దాని పేరు మార్చి, ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ (ISRO)గా మార్చి వెన్నుదన్నుగా నిలిచారు విక్రమ్ సారాభాయ్.

1919 ఆగస్టు 12న అంబాలాల్, సరళాదేవి దంపతులకు జన్మించారు విక్రమ్. మెట్రిక్యులేషన్ తర్వాత ఇండియన్ ఇన్స్టిటూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరులో ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సి.వి.రామన్ వద్ద పరిశోధకుడిగా చేరారు. విశ్వ కిరణాల పై వాతావరణ పరిస్థితులు ఏ – ప్రభావం చూపవనీ, సూర్యునిలో జరిగే సార చర్యలే విశ్వ కిరణాలలోని మార్పులకు కారణమవుతాయని చెప్పారు. అంతేకాకుండా గ్రహాంతర భౌతిక శాస్రంలో పరిశోధనలు జరిగే తరుణం ఆసన్నమైందని కూడా భావించాడు.

Also Read:అంతర్జాతీయ యూత్ డే..

భారత అణుశక్తి కార్యక్రమ పితామహుడు హెూమి జహంగీర్ భాభా సహకారంతో విక్రం సారాభాయ్ రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని తుంబాలో నెలకొల్పాడు. రెండేళ్ళలోపునే ఐక్యరాజ్య అంతర్జాతీయ సదుపాయాలున్న కేంద్రంగా గుర్తించింది. విక్రం సారాభాయ్ భార్య మృణాళినీ సారాభాయ్ ప్రఖ్యాతిగాంచిన భరతనాట్యం, కథాకళి నృత్యకారిణి. ఆమే కేరళ రాష్ట్రానికి చెందినది. భర్తతో కలిసి ఆమె అహ్మదాబాద్లో దర్పణ్ అకాడమిని నాట్య నాటక శిక్షణ కోసం నెలకొల్పింది. సారాభాయ్ దంపతులకు యిద్దరు పిల్లలు. మల్లిక సారాభాయ్ కూడా ప్రఖ్యాత నాట్యకారిణి. మరొకరు కార్తికేయ సారాభాయ్ పర్యావరణ శాస్రవేత్తగా తర్వాతి పద్మశ్రీ అవార్డు స్వీకరించారు.

ఇక విక్రమ్‌కు 1962లో శాంతిస్వరూప్ భట్నాగర్ మెడల్,1966లో పద్మభూషణ్ , 1972లో మరణాంతరం పద్మవిభూషణ్ అవార్డు దక్కింది. డిసెంబర్ 31, 1971 లో మరణించారు విక్రమ్.

Also Read:హారర్ థ్రిల్లర్… ‘పిజ్జా3’

- Advertisement -