బీజేపీ నేతృత్వం వహిస్తున్న ఎన్డీయే కూటమి వచ్చే ఎన్నికల్లో కూడా విజయ ఢంఖా మోగించాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే తాజాగా పరిణామాలు చూస్తూంటే ఎన్డీయే కూటమిలోని చాలా పార్టీలు బయటకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ నియంతృత్వ పోకడలు ఆయా మిత్రా పక్ష పార్టీలకు మింగుడు పడడం లేదట. అంతే కాకుండా ఈ మద్యకాలం జరిగిన ఆయా పరిణామాలు ముఖ్యంగా మణిపూర్ అల్లర్లు, రైతు చట్టాల వ్యతిరేకత, డిల్లీ ఆర్డినెన్స్ వంటివి ప్రజల్లో బీజేపీకి ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దీంతో బీజేపీతో దోస్తీ అలాగే కొనసాగిస్తే వచ్చే ఎన్నికలో తమకు కూడా ఇబ్బందే అని అభిప్రాయంలో ఆయా పార్టీల అధినేతలు ఉన్నట్లు తెలుస్తోంది..
మణిపూర్ అల్లర్ల విషయంలో మోడి సర్కార్ కు వ్యతిరేకంగా విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. విపక్షలకు బలం లేనప్పటికి అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడానికి కారణం ఎన్డీయేలోని ఆయా పార్టీల మద్దతు లభిచే అవకాశం ఉందనే అభిప్రాయమే. దానికి తగినట్లుగానే ఎన్డీయేలో మిత్రా పక్షంగా ఉన్న మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపి బీజేపీకి గట్టి షాక్ ఇచ్చింది. ఇదే పార్టీ దారిలోని ఎన్డీయేలోని మరికొన్ని పార్టీలు కూడా అవిశ్వాసానికి మద్దతిచ్చే ఆలోచనలో ఉన్నట్లు వినికిడి.
Also Read:బండి సంజయ్ రాజీనామాకు సిద్దమా?
తాజాగా బిహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ వ్యాఖ్యలు కూడా ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఎన్డీయే నుంచి చాలా పార్టీలు బయటకు రావాలని చూస్తున్నాయని, సరిగ్గా ఎన్నికల ముందు ఎన్డీయే బలహీన పడి విపక్ష ఇండియా కూటమి బలం పెంచుకోవడం ఖాయం అని చెప్పుకొచ్చారు. ఎన్డీయే మిత్రపక్షంగా ఉన్న మిజో నేషనల్ ఫ్రంట్ అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపడంతో ఆ పార్టీ బీజేపీతో దోస్తీ తెగతెంపులు చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో ఎన్డీయే నుంచి ఇంకెన్ని పార్టీలు బయటకు వస్తాయో చూడాలి.
Also Read:ఇదేనా బీజేపీ సమన్యాయం?