రాహుల్ లో ఫైర్ కనిపించిందా?

38
- Advertisement -

పరువు నష్టం కేసు కింద రాహుల్ గాంధీ పై వేసిన అనర్హత వేటును సుప్రీం కోర్టు ఇటీవల ఎత్తివేసిన సంగతి తెలిసిందే. దాంతో ఈ పార్లమెంట్ సమావేశాలకు ఆయన హాజరయ్యేందుకు మార్గం సులువైంది. దీంతో రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ఏం మాట్లాడతారు ? మోడీ సర్కార్ పై ఎలాంటి విమర్శలు గుప్పిస్తారు అనే అంశాలు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించాయి. పైగా మోడీ సర్కార్ పై విమర్శలు ఎక్కుబేట్టేందుకు పలు అంశాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సంగతి కూడా తెలిసిందే. ముఖ్యంగా మణిపుర్ అల్లర్లు, ఆధాని కుంబకోణం వంటివి మోడీ సర్కార్ ను ఇరుకున పెట్టె అంశాలే. పైగా మణిపూర్ అల్లర్ల విషయంలో మోడీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం కూడా జరుగుతోంది..

ఈ నేపథ్యం రాహుల్ గాంధీ లోక్ సభలో చేసే వ్యాఖ్యలపై అందరిలోనూ క్యూరియాసిటీ పెరిగింది. ఇక లోక్ సభలో తన ప్రసంగాన్ని కొద్దిసేపు మాత్రమే కొనసాగించినప్పటికి తనదైన రీతిలో మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పించి రాజకీయ వేడి పెంచారు. మోడీని రావణాసురుడితో పోల్చుతూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన హిందూస్తాన్ మాట వినరని.. ఆదానీ అమిత్ షా మాటలు మాత్రమే వింటారని ఫైరయ్యారు. బీజేపీ ప్రభుత్వం మనిపూర్ ప్రజలను చంపి భరతమాతను హత్య చేసిందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఇతరత్రా కార్యక్రమాల వల్ల సభ నుంచి బయటకు వెళ్ళిపోయిన రాహుల్ గాంధీపై మరో కాంట్రవర్సీ నడుస్తోంది. రాహుల్ గాంధీ బయటకు వెళ్తూ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారని బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఇలాంటి సంస్కృతి గతంలో ఎన్నడూ చూడలేదని ఆమె మండి పడ్డారు. ఈ వ్యవహారంపై మహిళా ఎంపీలు స్పీకర్ కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి అనర్హత వేటు తరువాత మొదటిసారి లోక్ సభ కు రాహుల్ వచ్చి తనదైన రీతిలో అగ్గి రాజేసే వ్యాఖ్యలు చేసిన. మళ్ళీ వివాదంలో చిక్కుకోవడం కాంగ్రెస్ ను కలవరపరిచే అంశమే. మరి ఏం ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి..

Also Read:KTR:ఐటీ హబ్‌తో ఉద్యోగాల సృష్టి

- Advertisement -