డిల్లీపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ విషయంలో ఏ స్థాయిలో రగడ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వం విపక్షాల మద్దతు కోసం గత కొన్నాళ్లుగా గట్టిగానే ప్రయత్నిస్తోంది. మద్దతు కోసమే INDIA కూటమితో కూడా చేతులు కలిపారు కేజ్రివాల్. అయితే ఆయన ఎన్ని ప్రయత్నలు చేసిన విపక్షాలు మద్దతు గట్టిగానే ఉన్నప్పటికి కేంద్ర ప్రబుత్వానిదే పైచేయిగా నిలిచింది. పార్లమెంట్ లో డిల్లీ ఆర్డినెన్స్ బిల్లును ప్రవేశ పెట్టారు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
డిల్లీ ఆర్డినెన్స్ బిల్లు పై విపక్షలు అనసవరంగా ఇష్యూ చేస్తున్నాయని, డిల్లీ పై చట్టాలు చేసే అధికారం కేంద్ర ప్రబుత్వానికి ఉందంటూ అమిత్ షా చెప్పుకొచ్చారు. రాజ్యంగ బద్దంగానే డిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ఉందని స్పష్టం చేశారాయన. అంతే కాకుండా డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ పై కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. డిల్లీలో కేజ్రివాల్ ఎంతో అవినీతికి పాల్పడ్డారని, ఆయన డిల్లీ అభివృద్ది పక్కన పెట్టి ఇండియా కూటమి గురింఛే ఎక్కువ ఆలోచిస్తున్నారంటూ చురకలంటించారు. మొత్తానికి గత కొన్నాళ్లుగా డిల్లీ ఆర్డినెన్స్ పై కొనసాగుతున్న సందిగ్ధత.. బిల్లు ప్రవేశ పెట్టడంతో ఆ రగడకు తెరపడే అవకాశం ఉంది. అయితే కేవలం డిల్లీ ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తూ మద్దతు కోసం విపక్ష కూటమితో చేతులు కలిపిన కేజ్రివాల్.. ఇప్పుడేం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
Also Read:వైద్యరంగంలో తెలంగాణ భేష్..