ఆయనో మాస్ లీడర్..ముక్కుసూటిగా మాట్లాడటం ఆయన నైజం. రైతు కుటుంబంలో పుట్టి తిరుగులేని రాజకీయ నాయకుడిగా ఎదిగిన గొప్ప నేత. ఆయనే సిద్దరామయ్య. కన్నడ రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన సిద్దూ బర్త్ డే నేడు.
1948 ఆగస్టు 3న మైసూరులోని సిద్ధరామనహుండిలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు ఇద్దరూ చదువుకోలేదు. కర్ణాటకలో మూడో అతి పెద్ద సామాజిక వర్గమైన కురుబ (ఓబీసీ)కి చెందిన వారు. చిన్నప్పటి నుంచి చదువుపై ఎక్కువగా ఆసక్తి ఉన్న సిద్ధరామయ్య ఉన్నత చదువులు చదివారు. మైసూరులో న్యాయవాదిగా, న్యాయశాస్త్ర అధ్యాపకుడిగా పని చేశారు.
రైతు ఉద్యమాల్లో పాలుపంచుకుంటూ రైతు నాయకుడు నంజుండస్వామి ప్రియ శిష్యుడిగా మారిపోయారు. ఆయన స్ఫూర్తితోనే 1978లో తాలూకా బోర్డు సభ్యుడిగా ఎన్నికై తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తర్వాత తిరుగులేని నాయకుడిగా మారారు. 1963లో తొలిసారి చాముండేశ్వరి అసెంబ్లీ స్థానం నుంచి భారతీయ లోక్ దళ్ అభ్యర్థిగా పోటీ చేసి సంచలన విజయం సాధించారు.
Also Read:షర్మిల చేరికపై ఎందుకీ మౌనం?
1985 ఎన్నిక్లలో గెలిచి హెగ్డే ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. 1992లో జనతాదళ్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1994ల ఎన్నికల్లో గెలిచి దేవెగౌడ నాయకత్వంలోని జనతాదళ్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేశారు. దేవెగౌడ ప్రధాని పదవి చేపట్టడంతో 1996లో జేహెచ్ పటేల్ సీఎం కాగా సిద్ధరామయ్య ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జనతాదళ్ జేడీఎస్, జేడీయూగా చీలి పోవడంతో సిద్ధరామయ్య దేవెగౌడ నాయకత్వంలోని జేడీఎస్లో చేరి రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. 2004లో డిప్యూటీ సీఎంగా, ఆర్థిక మంత్రిగా పని చేశారు. అయితే తర్వాత జేడీఎస్లో ఏర్పడిన విభేదాల కారణంగా కాంగ్రెస్ లో చేరారు. 2008 ఎన్నికల్లో గెలిచి సీఎల్పీ నేతగా ఎన్నికయ్యారు.
2013లో కాంగ్రెస్ పార్టీ 122 సీట్లతో ఘనవిజయం సాధించడంలో సిద్ధూ కీలక పాత్ర పోషించి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇక గత ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్లో గెలుపులో కీలకపాత్ర పోషించి మరోసారి సీఎం పీఠాన్ని అధిరోహించారు.ఆర్థిక మంత్రిగా పని చేసి ఇప్పటి వరకూ 13 సార్లు బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.
Also Read:KTR:బీఆర్ఎస్..భారత ‘రైతు’ సమితి