CM KCR:సాయన్న లేని లోటు తీర్చలేనిది

43
- Advertisement -

కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతిపట్ల శాసనసభ నివాళి అర్పించింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన అనంతరం సీఎం కేసీఆర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన గొప్ప నాయకుడు సాయన్న అన్నారు సీఎం. ఐదు సార్లు ఎమ్మెల్యేగా వివిధ హోదాల్లో పనిచేశారని…వ్యక్తిగతంగా ఆయనతో మంచి అనుబంధం ఉందని చెప్పారు.

సాయన్న లోటు పార్టీకి తీరని లోటన్నారు. ఎలాంటి సందర్భంలోనైనా చిరునవ్వుతో చాలా ఓపికతో ఉండేవారని, అందరితో కలుపుగోలుగా మాట్లాడేవారన్నారు. తాను ముఖ్యమంత్రిని అయ్యాక.. అనేక సందర్భాల్లో ఏదైనా ప్రయత్నం చేసి హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంట్‌ను కలిపేందుకు ఎనలేని కృషి చేశారన్నారు.

Also Read:Runamafi:రైతుల సంబురాలు

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి కంటోన్మెంట్లను నగరపాలికల్లో కలపాలని ఆలోచిస్తుందన్న శుభవార్త అందింది. ఆ రకంగానైనా సాయన్న కోరిక నెరవేరాలని కోరుకుంటున్నానన్నారు. సాయన్న నిజామాబాద్‌ జిల్లాలో జన్మించారని, హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీలో సెటిలై.. వ్యాపారవేత్తగా ఉన్నారన్నారు. సాయన్న కుటుంబం తమ కుటుంబంలాంటిదని ఆ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు.

Also Read:డేంజర్.. ఫోన్ లోకి కొత్త వైరస్!

- Advertisement -